బాలీవుడ్ లో ఏ సినిమా రిలీజ్ అయినా నెటిజెన్స్ ఆ సినిమా చూడడానికి ఆసక్తి చూపించడం మానేసి.. అసలు సినిమాకి ఎలాంటి రిజల్ట్ వస్తుందా అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. గత రెండేళ్లుగా బాలీవుడ్ పై నెటిజెన్స్ వ్యతిరేఖత సోషల్ మీడియాలో ఎక్కువగా కనబడుతుంది. ఈ ఏడాది షారుఖ్ ఖాన్ పఠాన్ వచ్చి బాక్సాఫీసుని షెకాడించింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ బోల్తా పడ్డాయి. ఒకటి రెండు సినిమాలు 100 కోట్ల క్లబ్బులోకి చేరినా అవి అంతగా హైలెట్ అవ్వనే లేదు.
ఇక ఈ రంజాన్ కి సల్మాన్ ఖాన్ కిసి కా భాయ్ కిసి కా జాన్ సినిమాని రిలీజ్ చేసాడు. ఈద్ కి సల్మాన్ భారీ సినిమా విడుదల కావడం కొన్నాళ్లుగా ఆనవాయితీగా వస్తుంది. భారీ తారాగణంతో భారీగా తెరకెక్కిన ఈ చిత్రంపై విడుదలకు ముందు భారీ అంచనాలేమి లేవు. ఇక నిన్న శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి నెగెటివ్ టాక్ రాగా.. అక్కడి క్రిటిక్స్ మాత్రం ఈ చిత్రం సూపర్ అంటూ రివ్యూస్ ఇచ్చారు. అసలు కిసి కా భాయ్ కిసి కా జాన్ చిత్రం తమిళంలో అజిత్ నటించిన వీరమ్, తెలుగులో పవన్ కాటమరాయుడు సినిమాలను మిక్సీలో వేసి రుబ్బినట్టుగా ఉందంటూ కామెడీ చేస్తున్నారు.
అదేదో వీరమ్ రీమేక్ అని చెబితే సరిపోయేది.. కానీ ఇదేదో ఒరిజినల్ స్టోరీలా బిల్డప్ ఇచ్చారు. ఒక్క సల్మాన్ తప్ప సినిమాలో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్ లేదంటున్నారు సినిమా చూసిన జనాలు. రీమేక్ కథ పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయలేకపోవడం, సెకండ్ హాఫ్ సాగదీత, ఎనిమిదిమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఇచ్చిన పాటలు అన్నీ ఈ సినిమాని డిసాస్టర్ చేసేశాయి. సల్మాన్ ఖాన్ ఇలాంటి సినిమాలకి దూరంగా ఉంటే ఆయన స్టార్ డమ్ నిలబడుతుంది అంటున్నారు. కొన్నాళ్లుగా సల్మాన్ ఖాన్ చిత్రాలు అయితే హిట్టు, లేదంటే భారీ డిజాస్టర్స్ గా మిగిలిపోతున్నాయి.
ఇక కిసి కా భాయ్ కిసి కా జాన్ తో బాలీవుడ్ కి మరో భంగపాటు తప్పలేదు. సల్మాన్ ఖాన్ అయినా బాలీవుడ్ కి హిట్టు కళ తీసుకొస్తాడనుకుంటే ఆయన కూడా అట్టర్ ప్లాప్ ని అందించడంతో.. మరోసారి బాలీవుడ్ వెల వెల బోతుంది.