నటి మీనా గత ఏడాది భర్త విద్యా సాగర్ ని కోల్పోయి చాలా రోజులు అదే బాధలో ఉండిపోయింది. కానీ తన కుమార్తె నైనిక భవిష్యత్తు దృష్యా ఆమె భర్త మరణించిన మూడు నెలలలోపు సినిమా షూటింగ్స్ కి హాజరైంది. దానితో మీనాపై చాలా ట్రోల్స్ నడవడమే కాదు.. మీనా రెండో పెళ్లి విషయమై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. మీనా కోలీవుడ్ కి చెందిన స్టార్ హీరోని సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతుంది, అతనికి ఇది రెండో పెళ్లి అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే మీనా కుమర్తె తన తల్లిపై తప్పుడు వార్తలు చూసి బాగా ఎమోషనల్ అయ్యింది.
గత నెలలో మీనాకి చెన్నై లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ సన్మానం జరిగింది. ఈ వేడుకకి రజినీకాంత్ దగ్గరనుండి కోలీవుడ్ లోని మీనా ఏజ్ యాక్ట్రెస్ అంతా హాజరయ్యారు. సూపర్ స్టార్ రజినీకాంత్ మీనా 40 ఇయర్స్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఆమెకి ఘనంగా సత్కారం చేసారు. ఈ ఈవెంట్ లో మీనా కూతురు నైనిక మాట్లాడిన మాటలకు అక్కడున్న వారంతా ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో తాజాగా విడుదలై వైరల్ అయ్యింది.
మీనా కూతురు స్టేజ్ పై ఎక్కి అమ్మ నువ్వు ఈ స్థాయిని చేరుకున్నందుకు గర్విస్తున్నాను, నటిగా కష్టపడడమే కాదు, అమ్మగా నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటావు, చిన్నప్పుడు నేను షాపింగ్ లో తప్పిపోయినప్పుడు నువ్వెంతగా టెన్షన్ పడ్డావో నాకు తెలుసు. దానికి సారి. నాన్న చనిపోయాక నువ్వు డిప్రెషన్ కి లోనయ్యావు. ఎంతగా బాధపడ్డావో నాకు తెలుసు. ఇకపై నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను.
ఈమధ్యన ఓ ప్రముఖ ఛానల్ వాళ్ళు నీపై ఫేక్ న్యూస్ రాస్తున్నారు. మా అమ్మ కూడా మనిషే కదా. ఆమెకి ఫీలింగ్స్ ఉంటాయి.. అమ్మపై అలాంటి తప్పుడు వార్తలు రాయొద్దు అంటూ నైనిక స్టేజ్ పై తల్లి విషయంలో ఎమోషనల్ గా చేసిన వ్యాఖ్యలకి అక్కడున్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టిన వీడియో అందరిని కదిలిస్తుంది.