మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మమ్ముట్టి మదర్ ఫాతిమా ఇస్మాయిల్ ఈరోజు శుక్రవారం పరమపదించారు. కొద్దిరోజులుగా అనారోగ్య కారణాలతో కొచ్చి లోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఫాతిమా ఇస్మాయిల్(93) ఈరోజు కన్నుమూయడంతో మమ్ముట్టి ఇంట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మమ్ముట్టి తల్లి మరణవార్త తెలుసుకున్న మలయాళ సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకి సంతాపం తెలియజేస్తున్నారు.
ఈరోజు సాయంత్రమే మమ్ముట్టి తల్లి ఫాతిమా అంతక్రియలు నిర్వహించన్నట్లుగా తెలుస్తుంది. మమ్ముట్టి తెలుగు, తమిళ ప్రేక్షకులకి సుపరిచుతుడు. ఆయన సినిమాలు ఇక్కడ డబ్ అవ్వడమే కాదు.. స్ట్రయిట్ తెలుగు సినిమాల్లోనూ ఆయన నటించారు. మమ్ముటి లేటెస్ట్ గా తెలుగులో నటించిన ఏజెంట్ మూవీ వచ్చే శుక్రవారం విడుదల కాబోతుంది.