ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాని వినియోగిస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీస్ తమ అభిమానులకి ఈ సోషల్ మీడియా ద్వారానే అందుబాటులో ఉంటూ వారిలో హుషారు తెస్తూ ఉంటారు. ప్రతి ఒక్క విషయాన్ని జనాలకు చేరవేయడానికి సోషల్ మీడియా మార్గేమద్యంగా తయాయ్యింది. ఇక సోషల్ మీడియాలో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాల్లో సెలబ్రిటీస్ సందడి ఎక్కువగా ఉంటుంది. అందులో బ్లూ టిక్ ఉంటే.. అదివారి అఫీషియల్ అకౌంట్ పేజీ సింబల్ గా అర్ధం అయ్యేది.
ఇప్పుడు ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ సెలబ్రిటీస్ బ్లూ టిక్ ని తొలగించాడు. అయితే ఆయన ఊరికే ఆ బ్లూ టిక్స్ ని తొలగించలేదు. మైక్రో బ్లాగింగ్ ట్విట్టర్ వాడే వారి చందా చెల్లించని కారణంగా పలువురి బ్లూ టిక్స్ ని తొలగించడంతో సెలబ్రిటీస్ మొత్తం గోలెత్తిపోతున్నారు.. బై బై బ్లూ టిక్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఎలాన్ మస్క్ కొత్త రూల్స్ ప్రకారం నెలనెలా లేదంటే ఏడాదికి ఒక్కసారే చందాలు చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించని వారి బ్లూ టిక్స్ ఏప్రిల్ 20 నుండి తొలగించబడతాయని చెప్పినట్టుగానే పలువురి సెలబ్రిటీస్ బ్లూ టిక్స్ ఎగిరిపోయాయి.
ఈ బ్లూ టిక్ పోయిన వారిలో టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎక్కువగా కనిపించడం గమనార్హం. మెగాస్టార్ చిరు దగ్గర నుండి.. చరణ్, అల్లు అర్జున్, నాగ చైతన్య లాంటి స్టార్స్ ఉండగా, ఇక హీరోయిన్స్ అయితే లెక్కేలేదు. బాలీవుడ్ లోను అమితాబ్, దీపికా లాంటి సెలబ్రిటీస్ కి ఈ బ్ల్యూ టిక్ ఎగిరిపోగా.. వాళ్ళ అభిమానులైతే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అటు సెలబ్రిటీస్ బ్లూ టిక్ లేకుండా చేస్తున్న ట్వీట్స్ వెలవెలబోతున్నాయి.