Advertisementt

మెగాస్టార్ ఇంట్లో ఉపాసన సీమంతం

Thu 20th Apr 2023 06:02 PM
upasana konidela,megastar  మెగాస్టార్ ఇంట్లో ఉపాసన సీమంతం
Upasana Seemantham at Megastar house మెగాస్టార్ ఇంట్లో ఉపాసన సీమంతం
Advertisement
Ads by CJ

ఉపాసన కొణిదెల ప్రెగ్నెంట్ అవడం.. మెగా ఫ్యామిలిలో ఆనందం తాండవించేలా చేసింది. వాళ్ళ ఫ్యామిలీలోకి మూడో తరం వారసుడు రాక కోసం పదేళ్ళుగా ఆ ఫ్యామిలీ వెయిట్ చెయ్యని క్షణం లేదు. రామ్ చరణ్-ఉపాసన తల్లితండ్రులుగా ప్రమోట్ అవ్వబోతున్నారని తెలిసి ఆ ఫ్యామిలీ మొత్తం సంతోషంలో మునిగిపోయింది. ఉపాసనకు ప్రస్తుతం ఏడు నెలలు నిడుతుండడంతో.. ఇప్పటికే దుబాయ్ లో ఉపాసన పుట్టింటి వారు, ఆమె చెల్లెళ్ళు బేబీ షోర్ ఫంక్షన్ ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసారు,.

చరణ్-ఉపాసన ఇద్దరూ ఆ ఫంక్షన్ లో చాలా ఎంజాయ్ చేసారు. ఇక ఉపాసన-రామ్ చరణ్ మాల్దీవ్స్ నుండి రాగానే.. కొద్దిగాపాటి రెస్ట్ తో మరోసారి మెగా ఫ్యామిలి ఉపాసన శ్రీమంతం వేడుకలు ఘనంగా నిర్వహించింది. కొణిదెల వారింటి కోడలి సీమంతం అంటే ఎలా ఉంటుందో అంత గ్రాండ్ గా ఈ ఫంక్షన్ ని నిర్వహించినట్లుగా బయటికొచ్చిన ఫొటోస్ చూస్తే తెలుస్తుంది. అయితే ఉపాసన ఏ డిజైనర్ డ్రెస్ లోనో.. లేదంటే సారీ లోనో కనబడుతుంది అనుకుంటే జస్ట్ నార్మల్ వేర్ లో సింపుల్ గా కనిపించింది.

ఈ వేడుకలో అల్లు ఫ్యామిలీ-మెగా ఫ్యామిలీ అందరూ కలిసి ఎంజాయ్ చేసిన పిక్స్ ఇన్స్టా లో వైరల్ అవ్వగా.. ఉపాసనకు శ్రీమంతం చేసి ఆ అందాన్ని ఆమె మోహంలో కనిపించేలా మెగాస్టార్ చిరు భార్య సురేఖ ఆ పిక్స్ లో కనిపించారు. ఉపాసన మెగా ఫ్యామిలీ బేబీ షవర్ ఫంక్షన్ ఫొటోస్ మీ కోసం.. 

Upasana Seemantham at Megastar house:

Upasana Konidela Baby shower function at Megastar house

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ