అక్కినేని అఖిల్ ఏజెంట్ ప్రమోషన్స్ లో దూసుకుపోతున్నాడు. సురేందర్ రెడ్డి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ అఖిల్ తన టీమ్ ని ఏసుకుని ఏజెంట్ ని ప్రేక్షకుల్లోకి తీసుకుని వెళుతున్నాడు. ఇప్పటికే ఏజెంట్ ట్రైలర్ ఆడియన్స్ కి కిక్ ఇవ్వగా.. సెలబ్రిటీస్ ఏజెంట్ గా అఖిల్ సిక్స్ ప్యాక్ ట్రాన్సఫార్మేషన్ ని పొగిడేస్తున్నారు. అయితే అఖిల్ వరస ఇంటర్వూస్, ప్రెస్ మీట్స్, ఆడియన్స్ తో ఇంటరెక్షన్ అంటూ హడావిడి చేస్తూనే అనేక విషయాలను బయటపెడుతున్నాడు.
అన్న నాగ చైతన్య తో కలిసి నటించడానికి సరిపోయే స్క్రిప్ట్ దొరకడం లేదని.. అక్కినేని మనం లాంటి స్క్రిప్ట్స్ తో పదే పదే సినిమాలు చేస్తే వాటికున్న విలువపోతుంది.. మంచి కథ దొరికితే అన్నయ్యతో కలిసి తప్పకుండా సినిమా చేస్తాను అని చెప్పిన అఖిల్.. ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీస్ గురించి ఆలోచించడం లేదు అన్నాడు. ఒకవేళ మల్టీస్టారర్ చెయ్యాల్సి వస్తే రామ్ చరణ్ తో సినిమా చేస్తాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
రామ్ చరణ్-అఖిల్ కి మధ్యన మంచి రిలేషన్ ఉంది. మెగాస్టార్ చిరు ఫ్యామిలీతో అక్కినేని ఫ్యామిలీ మంచి సంబంధాలు మెయింటింగ్ చెయ్యడమే కాదు.. అఖిల్ అంటే మెగా ఫ్యామిలీకి చాలా ఇష్టం. ఇక అఖిల్ కూడా అవకాశం వస్తే చరణ్ తో మల్టీస్టారర్ చెయ్యడానికి ఇష్టపడతాను అంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.