సుకుమార్ ఇంటిపై, ఆఫీస్ పై నిన్నటి నుండి ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ తో సుకుమార్ కి అనుబంధం ఉండడం, సుకుమార్ దర్శకత్వంతో పాటుగా సినిమాలు నిర్మించడం, జీఎస్టీ కట్టని కారణంగానే సుకుమార్ ఇంటిపై ఐటి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నిన్నటి నుండి సుకుమార్ ఇల్లు, మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులు, ఆ నిర్మాతల ఇళ్లపై ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు.
శంషాబాద్, మొయినాబాద్ లలో భారీగా ఆస్తులు కూడబెట్టారని, 100 ల ఎకరాలు అక్రంగా కొనుగోలు చేసినందుకే ఈ ఐటి దాడులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఏడాదిన్నర కాలంలో మైత్రి మూవీస్ మేకర్స్ పై ఐటి దాడులు జరగడం ఇది రెండోసారి. డిసెంబర్ లోనే మైత్రి మూవీస్ ఆఫీస్ లపై ఐటి సోదాలు జరిగాయి. ఇక సుకుమార్ కి మైత్రి మూవీస్ వారికి ఉన్న సంబందాలపైనా ఐటి అధికారులు అరా తీసినట్టుగా తెలుస్తుంది.
సుకుమార్ ప్రస్తుతం మైత్రిలోనే పుష్ప 2 ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ ఇల్లు, ఆఫీస్ పై ఐటి అధికారులు ఇంకా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో పలు కీలక ఆధారాలు ఐటి అధికారులు సేకరించినట్లుగా తెలుస్తుంది.