రిపబ్లిక్ తో సాయి ధరమ్ తేజ్ హిట్ కొట్టినా.. ఆ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. రిపబ్లిక్ సినిమా చాలా అంటే చాలా బావుంది అన్నారు కానీ.. కలెక్షన్స్ పరంగా సినిమా హిట్ అవ్వలేదు. ఆ సినిమా తర్వాత సాయి తేజ్ నుండి వస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ విరూపాక్ష. ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు దర్శకత్వం వహించడం, ప్రమోషన్స్ పరంగా సినిమాకి మంచి హైప్ క్రియేట్ అవడంతో.. సినిమాపై అంచనాలు మొదలయ్యాయి.
ఇప్పటికే విరూపాక్ష సెలెబ్రిటీ షోస్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడం, అలాగే మేకర్స్ కూడా టేబుల్ ప్రాఫిట్ లో ఉండడంతో సాయి తేజ్ కి ఈ సినిమాతో హిట్ పడినట్లే అంటున్నారు. రోడ్ యాక్సిడెంట్ తో సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చిన సాయి తేజ్.. విరూపాక్ష ప్రమోషన్స్ లో ఆ యాక్సిడెంట్ గురించి చెప్పడం.. ఇవన్నీ సినిమాకి హెల్ప్ అవడం పక్కగా కనిపిస్తున్నాయి.
ఒన్స్ సినిమా విడుదలై పాజిటివ్ టాక్ పడిపోతే విరూపాక్ష సేఫ్ అయినట్లే.. సాయి తేజ్ కి మంచి హిట్ పడినట్లే. తర్వాత సాయి తేజ్ మేనమావ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న రీమేక్ కూడా జులై లోనే విడుదలకి సిద్దమైపోతుంది.