మహానటి తర్వాత అంతటి విజయాన్ని మళ్ళీ దసరాతో అందుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు దూసుకుపోతుంది. గత ఏడాది సర్కారు వారి పాటుతో మహేష్ బాబు తో జోడి కట్టిన కీర్తి సురేష్ ఆ సినిమాలో గ్లామర్ గా టర్న్ అయ్యి అందాలు చూపించినా ఎవరూ పట్టించుకోలేదు. తన స్నేహితుడు నాని ఇచ్చిన దసరా ఆఫర్ ని పర్ఫెక్ట్ గా యూస్ చేసుకుని ఆ సినిమాతో వెన్నెలగా తెలంగాణ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఆ చిత్రం హిట్ అవడంతో ఇప్పుడు కీర్తి సురేష్ రేంజ్ మారిపోయేలానే కనిపిస్తుంది.
మహానటి తర్వాత వచ్చిన తమిళ స్టార్ అవకాశాలను సరిగ్గా వాడుకోలేని కీర్తి సురేష్ కి టాలీవుడ్ స్టార్స్ అయితే అసలు అవకాశాలు ఇవ్వలేదు. ప్రస్తుతం మెగాస్టార్ సిస్టర్ గా నటిస్తున్న భోళా శంకర్ మాత్రమే కీర్తి సురేష్ చేతిలో ఉన్న తెలుగు ప్రాజెక్ట్. తమిళ, మలయాళ అవకాశాలు మాత్రం బాగానే ఉన్నాయి. కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్న కీర్తి సురేష్ తాజాగా సారీ లుక్స్ వదిలింది.
సారీ లుక్ లో కీర్తి సురేష్ కిల్లింగ్ ఫోజులు ఆకర్షణీయంగా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. లూజ్ హెయిర్ తో కీర్తి సురేష్ చూపులు గుచ్చుకునేలా ఉన్నాయి. మరి కీర్తి సురేష్ కి దసరా హిట్ ఎంత హెల్ప్ అవుతుందో తదుపరి ఆమెకి వచ్చే ప్రాజెక్ట్స్ ని బట్టి తెలుస్తుంది.