Advertisementt

అల్లు అర్జున్-మహేష్ ఇద్దరూ అంత సైలెంట్ గా..!

Wed 19th Apr 2023 09:55 PM
ntr,pawan kalyan  అల్లు అర్జున్-మహేష్ ఇద్దరూ అంత సైలెంట్ గా..!
Allu Arjun-Mahesh are so silent..! అల్లు అర్జున్-మహేష్ ఇద్దరూ అంత సైలెంట్ గా..!
Advertisement
Ads by CJ

లాంగ్ గ్యాప్ తో #NTR30 మొదలు పెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనుక్షణం అభిమానులకి సినిమా విషయాలను అప్ డేట్స్ రూపంలో అందిస్తూ ఖుషి చేస్తున్నారు. ఏడాది కాలంగా అభిమానులకి పరీక్ష పెట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు అడుగడుగునా వారికి సర్ ప్రైజ్ లు అందిస్తూనే ఉన్నారు. సినిమా ఓపెనింగ్ మొదలు.. ప్రతి విషయాన్ని ఫాన్స్ తో షేర్ చేసుకునేలా మేకర్స్ ని ఎన్టీఆర్ ప్రిపేర్ చేశారు. 

అలాగే పవన్ కళ్యాణ్ కూడా తన ప్రతి సినిమా అప్ డేట్ అభిమానులకి అందేలా ప్లాన్ చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లో జాయిన్ అయినప్పటి స్టిల్ వదిలి షూటింగ్ విషయం ప్రకటించిన పవన్ తదుపరి OG సెట్స్ లోకి ఎంటర్ అయ్యేముందు హడావిడి చేస్తూ ఫాన్స్ కి హుషారుని తెప్పించారు. అలాగే హీరోయిన్ ఎంట్రీ విషయంలో అటు హరీష్ శ్రీలీలని పరిచయం చెయ్యగా ఇటు సుజిత్ ప్రియాంక మోహన్ కి సెట్స్ లోకి వెల్ కమ్ చెబుతూ అప్ డేట్ ఇచ్చారు. ఎన్టీఆర్-పవన్ ఇద్దరూ ఫాన్స్ కి ట్రీట్స్ మీద ట్రీట్స్ ఇస్తున్నారు.

కానీ మహేష్-అల్లు అర్జున్ మాత్రం గుట్టు చప్పుడు కాకుండా షూటింగ్స్ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు SSMB28 లో హీరోయిన్స్ జాయిన్ అయ్యారా అనే విషయం తెలియదు. ఏదో లీకెడ్ పిక్ లో పూజ హెగ్డే-మహేష్ కనిపించగానే మహేష్ ఫాన్స్ దానిని వైరల్ చేసేసారు. ఇక మరో హీరోయిన్ శ్రీలీల కూడా ఎప్పుడు సెట్స్ లోకి వెళ్లబోతుందో క్లారిటీ లేదు. ఇక అల్లు అర్జున్ కూడా పుష్ప ద రైజ్ షూట్ లో పాల్గొంటున్నాడు. అల్లు అర్జున్ బర్త్ డే కి ఫస్ట్ లుక్ అండ్ వీడియో ఇచ్చారు.

కానీ ఆ సినిమా షూటింగ్స్ పై ఎలాంటి అప్ డేట్ ఇవ్వట్లేదు. ఫహద్ ఫాసిల్ షూట్ లోకి ఎంటర్ అయ్యాడా .. రష్మిక మళ్ళీ వచ్చిందా అనే విషయం తెలియదు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఆంధ్ర-ఒడిస్సా సరిహద్దు మల్కన్ గిరి ఫారెస్ట్ కి వెళ్ళాడు. అక్కడే పుష్ప ద రైజ్ షూటింగ్ జరుగుతుంది. అయితే ఆయన అక్కడికి వెళ్లిన విషయం మాత్రం అప్ డేట్ ఇవ్వలేదు.. జస్ట్ లీకుల ద్వారా మాత్రమే బయటికి వచ్చింది.

మహేష్-అల్లు అర్జున్ ఇద్దరూ ఇలా సైలెంట్ గా పని చేసుకుంటూ ఫాన్స్ ని డిస్పాయింట్ చేస్తుంటే ఎన్టీఆర్-పవన్ కళ్యాణ్ మాత్రం ఓ రేంజ్ లో అప్ డేట్స్ ఇస్తూ ఫాన్స్ ని కూల్ చేస్తున్నారు.

Allu Arjun-Mahesh are so silent..!:

NTR-Pawan Kalyan giving a treat to fans

Tags:   NTR, PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ