Advertisementt

ఉపాసన కోసం చరణ్ సంచలన నిర్ణయం?

Wed 19th Apr 2023 08:20 PM
ram charan,upasana  ఉపాసన కోసం చరణ్ సంచలన నిర్ణయం?
Charan sensational decision for Upasana? ఉపాసన కోసం చరణ్ సంచలన నిర్ణయం?
Advertisement
Ads by CJ

రామ్ చరణ్-ఉపాసన దంపతులు త్వరలోనే తల్లితండ్రులుగా ప్రమోషన్ పొందబోతున్నారు. ఉపాసన ఏడు నెలల ప్రెగ్నెంట్. ఇప్పటికీ హెల్దీగానే తన భర్త చరణ్ తో కలిసి దేశ విదేశాలు చుట్టేస్తోంది. ఈ మధ్యనే దుబాయ్ లో సీమంతం వేడుకలని తన పుట్టింటి వాళ్ళు, సిస్టర్స్, ఫ్రెండ్స్ మధ్యలో ఘనంగా జరుపుకున్న ఉపాసన ఆ తర్వాత రామ్ చరణ్ తో కలిసి మాల్దీవ్స్ ట్రిప్ వెళ్ళొచ్చింది. అక్కడినుండి వచ్చాక ఓ ఇంటర్వ్యూలో తన ప్రెగ్నెన్సీ డైట్ సీక్రెట్స్ ని, అలాగే మెటర్నిటీ అవుట్ ఫిట్స్ పై క్లారిటీ ఇచ్చింది.

అయితే 11 ఏళ్ళ తర్వాత తండ్రిగా మారబోతున్న రామ్ చరణ్ ప్రస్తుతం ఈ స్వీట్ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. తనకి వీలున్నప్పుడల్లా ఉపాసనతో వెకేషన్స్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ కూడా షూటింగ్ చివరి దశలో ఉండడంతో.. శంకర్ తో కలిసి గేమ్ ఛేంజర్ షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి.. కొద్దిరోజులపాటు(దాదాపు మూడునెలలు) షూటింగ్స్ బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నట్లుగా ఆలోచన చేస్తున్నాడట. బిడ్డ తమ చేతుల్లోకి వచ్చేవరకు తన భార్య ఉపాసనతో అనుక్షణం గడిపేందుకు రామ్ చరణ్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది.

మెగా ఫ్యామిలీ కూడా రామ్ చరణ్ వారసుడి కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంది. ఎప్పుడెప్పుడు మెగా వారసుడు తమ చేతుల్లోకి వస్తాడా అనే ఆత్రంతో అటు కామినేని, ఇటు కొణిదెల ఫామిలీస్ ఉన్నాయి.

Charan sensational decision for Upasana?:

Ram Charan sensational decision for Upasana?

Tags:   RAM CHARAN, UPASANA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ