Advertisementt

ఈ నెలాఖరుకి సలార్ సర్ ప్రైజ్

Wed 19th Apr 2023 06:05 PM
prabhas,salaar  ఈ నెలాఖరుకి సలార్ సర్ ప్రైజ్
Salaar surprise at the end of this month ఈ నెలాఖరుకి సలార్ సర్ ప్రైజ్
Advertisement
Ads by CJ

ఫ్యాన్ ఇండియా స్టర్ ప్రభాస్-ఫ్యాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో క్రేజీ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న సలార్ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవడం కాదు.. మరో పది రోజుల్లో సలార్ షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసి కొబ్బరికాయ కొట్టెయ్యబోతున్నారట. నిన్నటివరకు అన్నపూర్ణ స్టూడియోస్ లో మారుతీ సినిమా షూటింగ్ లో పాల్గొన్న ప్రభాస్ ఈరోజు సలార్ సెట్స్ లోకి వచ్చేశారట. ఇంతకుముందు ఇటలీలోని మటేరా ప్రాంతంలో సలార్ లోని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు,.

ఇప్పుడు తాజాగా లాస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోనే మొదలైనట్టుగా తెలుస్తుంది. ఈ షెడ్యూల్ పూర్తికాగానే.. కొబ్బరికాయ కొట్టేసి ఈ నెల చివరిలో సలార్ నుండి సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారట మేకర్. గత మే లోనే సలార్ టీజర్ అన్నారు. కానీ ప్రభాస్ బర్త్ డే కి కూడా ఆ టీజర్ ఇవ్వకుండా మేకర్స్ ప్రభాస్ ఫాన్స్ ని డిస్పాయింట్ చేసారు. ఇక ఈ నెల చివరిలో కానీ, మే మొదటి వారంలో కానీ సలార్ టీజర్ ని రిలీజ్ చేసే ప్లాన్ లో టీమ్ ఉందట. 

టీజర్ తోనే ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుంది అని మేకర్స్ అధికారికంగా ప్రకటించడానికి రెడీ అయ్యారట. ఇక జూన్ 16 తర్వాత ప్రోపర్ గా పాన్ ఇండియా మార్కెట్ లో సలార్ ప్రమోషన్స్ మొదలు పెట్టాలని, ఆదిపురుష్ రిజల్ట్ ని బట్టి ప్రమోషన్స్ ని ప్లాన్ చేసే యోచనలో ఉన్నారట. ఈ సలార్ లాస్ట్ షెడ్యూల్లో ప్రభాస్ తో పాటుగా కీలక నటులు పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తుంది.

Salaar surprise at the end of this month:

Interesting surprise from Salaar

Tags:   PRABHAS, SALAAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ