యంగ్ టైగర్ ఎన్టీఆర్ -కొరటాల శివ కాంబోలో పాన్ ఇండియా ఫిలింగా మొదలైన #NTR30 షూటింగ్ హైదరాబాద్ లోనే శరవేగంగా జరిగిపోతుంది. తాజాగా #NTR30 లోకి విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ఎంట్రీ ఇచ్చారు. పాన్ ఇండియా ఫిలిం కావడంతో ఎక్కువగా హిందీ నటులని కొరటాల ఎంపిక చేస్తున్నారు. హీరోయిన్ గా ఇప్పటికే శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్ ని దించిన కొరటాల విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ని దించడం ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరగడానికి కారణమైంది.
అయితే నార్త్ ఆడియన్స్ కోసమే ఇలా బాలీవుడ్ నటులని ఎంపిక చేసిన కొరటాల.. వాళ్ళకి పారితోషకాలు కూడా భారీగానే ఇస్తున్నారట. ఇప్పటికే జాన్వీ కపూర్ కి 3 నుండి 3.5 కోట్ల పారితోషకం ఇస్తుండగా.. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ కి షాకింగ్ గా 15 కోట్లు అలాగే జీఎస్టీని పారితోషికంగా చెల్లిస్తున్నట్టు సమాచారం. సైఫ్ అలీ ఖాన్ కి బాలీవుడ్ లో క్రేజ్, అవకాశాలు తగ్గినప్పటికీ.. అతని వల్ల #NTR30 హిందీ మార్కెట్ కి హెల్ప్ అవుతున్న కారణంగానే మేకర్స్ అంత భారీ పారితోషకం ఇస్తున్నారని తెలుస్తుంది.
ప్రస్తుతం కొరటాల శివ ఎన్టీఆర్-జాన్వీ కపూర్- సైఫ్ అలీఖాన్ కాంబోలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు రెడీ అయ్యారట. దీనికోసమే జాన్వీ కపూర్ హైదరాబాద్ కి వచ్చినట్టుగా తెలుస్తుంది.