మంచు మనోజ్ తన అమ్మ నిర్మలకి, అక్క మంచు లక్ష్మికి జీవితాంతం రుణపడిపోయా అంటున్నాడు. వాళ్ళని లైఫ్ లాంగ్ ఎలాంటి బాధ లేకుండా చూసుకోవాలి, అందులోను తన వల్ల ఎలాంటి బాధ పడకుండా చూసుకుంటాను అంటూ ఎమోషనల్ అవుతున్నాడు. తన పెళ్లి విషయంలో అక్క, అమ్మ ఎంతగా నలిగిపోయారో అని తలచుకుంటేనే బాధగా ఉంటుంది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. అంటే తన పెళ్లి విషయంలో తనకి ఆటుపోట్లు ఎదురయ్యానే విషయాన్ని మంచు మనోజ్ చెప్పకనే చెప్పేసాడు. గత రాత్రి మనోజ్-మౌనికలు వెన్నెల కిషోర్ అలా మొదలయ్యింది షో కి అతిధులుగా వచ్చారు.
ఈ షోలో మౌనికతో తన ప్రయాణం ఎలా మొదలయ్యింది, ఎక్కడ మొదలయ్యింది.. ముందుగా ఎవరు ప్రపోజ్ చేసారో అనే విషయాలను మనోజ్ బయటపెట్టాడు. మౌనికని తానే ముందు ప్రపోజ్ చేశాను అని.. నిన్ను నీ కొడుకుని బాగా చూసుకుంటాను అని అడిగాను. అయితే పెళ్లి విషయంలో అన్న విష్ణు, వదిన విరోనికా కానీ, మోహన్ బాబు విషయం కానీ మాట్లాడని మనోజ్ తన ఫ్రెండ్స్, తన తల్లి, అక్క తనని సపోర్ట్ చేసారని చెప్పాడు.
తన అక్క మొదటి నుండి తమ ప్రేమని సపోర్ట్ చేసింది అని.. మౌనిక నేను ప్రపోజ్ చేసినప్పుడు అందరూ ఏమనుకుంటారో అని భయపడింది అని.. కానీ ఎవ్వరు ఏమనుకున్నా మనమెందుకు వెనక్కి తగ్గాలని నేనె ధైర్యం చెప్పాను, కొన్నాళ్ళు అజ్ఞాతవాసం అంటూ చెన్నై వెళ్ళాము, కొన్నాళ్ళు దేశాలు తిరిగాము అంటూ మనోజ్ అక్క లక్ష్మి తన ప్రేమని, పెళ్లిని ఎలా సపోర్ట్ చేసిందో చెప్పాడు. ఈ షో సాక్షిగా మనోజ్ అన్న విష్ణు తో మరోసారి విభేదాలు ఉన్నాయనే విషయాన్ని ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్పేసాడు. అంటే ఈ షో మొత్తంలో ఎక్కడా విష్ణు పేరు ఎత్తకుండా జాగ్రత్తపడుతూ ఎపిసోడ్ పూర్తి చేసాడు.