సౌత్ లో వరస సినిమాలు చేసినా రాశి ఖన్నాకి బ్రేక్ ఇచ్చిన సినిమా ఒక్కటి లేకపోవడంతో ఆమె ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాలు వెతుక్కునే పనిలో ఉంది. ఇప్పటికి ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన ఫార్జి లో మేఘన లాంటి క్యూట్ రోల్ తో నార్త్ ప్రేక్షకులను ఆకర్షించిన రాశి ఖన్నా ప్రస్తుతం అక్కడ ఆఫర్స్ కోసం గ్లామర్ అవతారం ఎత్తింది.
సౌత్ సినిమాల్లోనూ రాశి ఖన్నా గ్లామర్ పాత్రలకే పరిమితయ్యింది. ఆమెకి ఒక్కటి కూడా పెరఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్ర దొరకలేదు. దానితో రాశి ఖన్నాని సౌత్ ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. తెలుగు, తమిళంలో వరస ప్రాజెక్ట్స్ చేసిన రాశి ఖన్నాకి ఇప్పుడు ఇక్కడ ఒక్క అవకాశం కూడా చేతిలో లేదు. ఒకప్పుడు బొద్దుగా బబ్లీగా కనిపించిన ఆమె తాజాగా బరువు తగ్గి సన్నగా గ్లామర్ గా కనిపిస్తుంది.
బరువు తగ్గడానికి జిమ్ లో కసరత్తలు చేస్తూ తెగ కష్టపడిపోతుంది. రాశి ఖన్నా జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న పిక్ ని తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. మరి బరువు తగ్గి గ్లో మిస్ అవ్వకుండా అందాన్ని బాగానే మెయింటింగ్ చేస్తుంది రాశి. ఈ అందాన్ని మళ్ళీ తెలుగులోకి ఎప్పుడు చూస్తామో అని ఇక్కడి ఆడియన్స్ వెయిటింగ్.