Advertisementt

పవర్ ఫుల్ యాక్షన్ తో ఏజెంట్ ట్రైలర్

Tue 18th Apr 2023 10:17 PM
agent trailer  పవర్ ఫుల్ యాక్షన్ తో ఏజెంట్ ట్రైలర్
Agent Trailer Review పవర్ ఫుల్ యాక్షన్ తో ఏజెంట్ ట్రైలర్
Advertisement
Ads by CJ

ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ నుండి కొద్దిసేపటి క్రితమే ట్రైలర్ వదిలారు. కాకినాడలో వేలాది అక్కినేని అభిమానుల మధ్యన ఏజెంట్ ట్రైలర్ రిలీజ్ కి ఏజెంట్ టీం హైదరాబాద్ నుండి కాకినాడకు వెళ్ళింది. అక్కడ అభిమానుల మధ్యన గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ వేడుకని నిర్వహించారు. ఏజెంట్ గా అఖిల్ లుక్ ఇప్పటికే పోస్టర్స్ లో రివీల్ అయ్యింది. పెరఫార్మెన్స్ కానీ, ఆ యాక్షన్ సీన్స్ లో అఖిల్ నటనకు క్లాప్స్ పడడం ఖాయంగా కనిపిస్తుంది.

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కేరెక్టర్ సూపర్బ్ గా అనిపించగా.. ఏజెంట్ ట్రైలర్ లో యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి. సురేందర్ రెడ్డి మేకింగ్, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అని అదిరిపోగా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే రిచ్ గా కనిపించాయి. ఏజెంట్ ట్రైలర్ చివరి షాట్ లో అఖిల్ పేల్చిన బుల్లెట్స్ కి అభిమానులు కేకలు పెట్టేలా ఉంది. ఏజెంట్ ట్రైలర్ మొత్తం స్టైలిష్ యాక్షన్ తో నింపేశారు.

అఖిల్ హీరోయిన్ సాక్షి మధ్యన రొమాంటిక్స్ సన్నివేశాలు ఏజెంట్ ట్రైలర్ లో అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. రా ఏజెంట్ గా అఖిల్ కొత్తగా కనిపించి ఫాన్స్ తో విజిల్స్ వేయించేసాడు.

Agent Trailer Review:

Akhil Akkineni Agent Trailer 

Tags:   AGENT TRAILER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ