రష్మిక మందన్న ప్రస్తుతం యమా జోరుమీదుంది. IMDb లో మూడో స్థానంలో ప్లేస్ సంపాదించి టాప్ స్టార్స్ కే షాకిచ్చిన రష్మిక మందన్న మెరుపులు బాలీవుడ్ లో బాగా చక్కర్లు కొడుతున్నాయి. గ్లామర్ గా ఎక్స్పోజ్ అవుతూ అవకాశాలు మీద అవకాశాలు చేజిక్కించుకుంటున్న రష్మిక ప్రస్తుతం పుష్ప పాన్ ఇండియా ఫిలిం షూటింగ్ లో హడావిడీ చేస్తుంది. రీసెంట్ గానే పుష్ప నుండి ఆమె బర్త్ డే కి శ్రీవల్లిగా రష్మిక పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తాజాగా రష్మిక మందన్న ఓ మ్యాగజైన్ చేసిన ఫోటో షూట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. వైట్ అండ్ వైట్ లో రష్మిక Harpers bazaar🤍 ఫోటో షూట్ లో రకరకాల ఫోజులతో కేక పెట్టించింది. బ్యాగ్రౌండ్ వైట్ కర్టెన్స్ లో వైట్ అవుట్ ఫిట్ లో అదరగొట్టేసింది. ఇక రష్మిక ప్రస్తుతం, సౌత్ లోను ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిలిం, అలాగే నితిన్ కి జోడిగా మరో మూవీ మొదలు పెట్టింది.
ప్రస్తుతం మూడు నాలుగు సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండడమే కాదు, ఎక్కడ స్టేజ్ పెరఫార్మెన్స్ అవకాశం వచ్చినా అదరగొట్టేస్తుంది. ఇప్పటికే ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మోని లో రష్మిక డాన్స్ ఇంకా ఇంకా హాట్ టాపిక్ గానే నిలుస్తుంది.