సమంత.. శాకుంతలం విడుదల తర్వాత గట్టిగా వినిపించిన పేరు. గత ఏడాది మాయోసైటిస్ తో ఎంతగా బాధపడిందో ఆమె మాటల్లోనే చాలాసార్లు విని జాలిపడిన నెటిజెన్స్.. ఇప్పుడు శాకుంతలం ప్లాప్ తో సమంతపై చేస్తున్న కామెంట్స్ కి అడ్డుకట్ట పడడం లేదు. అసలు శాకుంతలంలో శకుంతల పాత్రని సమంత ఎలా ఒప్పుకుంది. గతంలో ఆమె మొహంలో ఉన్న క్యూట్ నెస్ ఇప్పుడు కనిపించలేదు. బాడీని మరీ పుల్లలా తయారు చేసింది. జిమ్ లో వర్కౌట్స్ అంటూ సమంత యాక్షన్ సీన్స్ కే పరిమితమవుతుంది.. ఇకపై లవ్ స్టోరీస్ ఆమెకి సెట్ కావు అంటూ సమంతని ఆడేసుకుంటున్నారు.
శాకుంతలం విడుదలకు ముందు పలు సిటీస్ లో శాకుంతలం ప్రమోషన్స్ లో పాల్గొంది. ఇంటర్వ్యూలో తన వివాహ జీవితంపై కామెంట్స్ చేస్తూ హైలెట్ అయ్యి సింపతిని క్రియేట్ చేసుకుంది. కానీ ఇప్పుడు సింపతీ స్థానంలో ఆమె జేడ్జ్మెంట్ ని తప్పుబడుతున్నారు. అయితే శాకుంతలం ప్రమోషన్స్ ని ఆమె హెల్త్ రీజన్స్ వలన ఆపేసిన సమంత, తర్వాత శాకుంతలం రిజల్ట్ పై ఎలాంటి కామెంట్ చెయ్యలేదు. తాను మొహమాటం కొద్దీ శకుంతల పాత్రని ఒప్పుకున్నాను, దిల్ రాజు వల్లే ఒప్పుకున్నానంటూ గతంలో సమంత కామెంట్స్ చేసింది.
తాజాగా శాకుంతలం డిసాస్టర్ తర్వాత సమంత చేసిన పోస్ట్ చూస్తే నిజంగానే ఆమె మొహమాటనికి పోయి డిసాస్టర్ ని కొని తెచ్చుకుంది అనిపించకమానదు. అది గ్రహించే ఆమె తన ఇన్స్టాలో ఓ పిక్ ని షేర్ చేస్తూ..
Karmanye vadhika raste
Ma phaleshu kadachana
Ma karma phala he tur bhuh
Ma te sangotsva karmani
కర్మణ్యే వాధికా రాస్తే
మా ఫాలేషు కదాచన
మా కర్మ ఫల హే తుర్ భూః
మా తే సంగోత్స్వ కర్మణి.. అంటూ పోస్ట్ చేసింది. కర్మని ఎవరూ తప్పించలేరు అనేది సమంత పోస్ట్ కి అర్ధం. నిజమే సమంత చెప్పింది అక్షరాలా నిజం. కర్మని అనుభవించడం తప్ప తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.