పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి ఏం కావాలో అవన్నీ OG లో కనిపిస్తున్నాయి. సాహో ప్లాప్ ని మరిపించేలా దర్శకుడు సుజిత్ OG స్టార్టింగ్ వీడియోని విడుదల చేసాడు. పవన్ కళ్యాణ్ కి ఎలాంటి సినిమా పడితే ఫాన్స్ కి నచ్చుతుందో అచ్చం అలానే OG స్క్రిప్ట్ ని రెడీ చేసినట్లుగా తెలియడమే కాదు.. OG ఫస్ట్ వీడియో దానికి ఉదాహరణగా ఉంది. ఆ వీడియో చూడగానే పవన్ ఫాన్స్ లో గూస్ బమ్ప్స్ వచ్చేసాయి. పవన్ స్పీడుని ఫాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్స్ అన్ని కంప్లీట్ చేసే పనిలో పవన్ ఉన్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్ OG సెట్స్ లోకి ఈరోజు ఏప్రిల్ 18 న అడుగుపెట్టారు. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ఎలా ఉంటారో పవన్ కళ్యాణ్ ని ఊహించుకుని ఆస్వాదిస్తున్న ఫాన్స్ కి ఈరోజు పవన్ కళ్యాణ్ లుక్ చూసి మెంటలెక్కిపొయింది. ఆయన సూపర్ స్టైలిష్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తున్నారు. సుజిత్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కి హిట్ ఇవ్వడం పక్కా అన్నట్టుగా పవన్ లుక్ కనిపించింది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లో డిఫరెంట్ లుక్స్ ట్రై చెయ్యకపోయినా ఫాన్స్ కి నచ్చినా.. ఇప్పుడు పవన్ OG కోసం మార్చిన లుక్ బాగా ఇంప్రెస్స్ చేసింది.
THE #OG HAS ARRIVED on sets… 🔥🔥🔥 #PawanKalyan #TheyCallHimOG #FireStormIsComing #𝙏𝙝𝙚𝙮𝘾𝙖𝙡𝙡𝙃𝙞𝙢𝙊𝙂💥 అంటూ మేకర్స్ పవన్ OG సెట్స్ లోకి వస్తున్న లుక్ ని రివీల్ చేసి మరీ ఫాన్స్ కి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ OG షూటింగ్ కోసం ముంబై వెళ్ళినట్లుగా తెలుస్తుంది.