నటి ఇలియానా సౌత్ లో టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పి బాలీవుడ్ మీద మోజుతో సినిమా అవకాశాలు పెట్టేసి.. అటు తర్వాత బాలీవుడ్ ఆఫర్స్ లేక, సౌత్ ఆఫర్స్ రాక ఆస్ట్రేలియా ఫోటో గ్రాఫర్ ఆండ్రుతో డేటింగ్ చేసి.. ఆ తర్వాత ఆండ్రు తో బ్రేకప్ లవ్ స్టోరీతో డిప్రెషన్ కి లోనై అందంగా ఉండే ఇలియానా బరువు పెరిగి కనిపించి షాకిచ్చింది. కొద్దిరోజులుగా సినిమాలకి, జిమ్ కి, సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్న ఇలియానా ప్రెగెన్సీ రూమర్స్ ఇప్పుడు ఆమె అభిమానులకి షాకిచ్చాయి.
ఆమె ఇన్స్టా లో ఓ టీ షార్ట్ పిక్ ని పోస్ట్ చేస్తూ అండ్ సో ద అడ్వెంచర్ బిగిన్స్.. త్వరలో వస్తుంది, నా లిటిల్ డార్లింగ్ ని కలవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ క్యాప్షన్ ఇవ్వడం.. దాని కింద ఇలియానా మథర్.. వెల్కమ్ సూన్ టు ద వరల్డ్ మై న్యూ గ్రాండ్ బేబీ, కాంట్ వెయిట్ అంటూ పోస్ట్ పెట్టడంపై అందరిలో అనేకరకాల అనుమానాలు మొదలయ్యాయి. అసలు ఇలియానా ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యింది, ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంది. అంటే నిజంగానే కత్రినా కైఫ్ సోదరుడిని ఇలియానా పెళ్లాడిందా అనే అనుమానాలు నెటిజెన్స్ లో మొదలయ్యాయి.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ బ్రదర్ సెబాస్టియన్ లారెంట్ మైఖేల్ తో గత కొన్నాళ్లుగా ఇలియానా డేటింగ్ చేస్తుంది అనే న్యూస్ లు వినిపిస్తున్నాయి. అయితే ఇలియానా ఇప్పుడు సెబాస్టియన్ లారెంట్ మైఖేల్ పెళ్లి చేసుకుందా.. అందుకే ఆమె ప్రెగ్నెంట్ అయ్యిందా.. నిజంగానే ఇలియానా ప్రెగ్నెంటేనా లేదంటే వాళ్ళ ఇంట్లో మారేదన్నా విశేషమా అంటూ అందరూ ఇప్పుడు సస్పెన్స్ లో కొట్టుమిట్టాడుతున్నారు.