అక్కినేని అఖిల్ హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఏజెంట్ ఏప్రిల్ 28 న రిలీజ్ కి రెడీ అయ్యింది. హడావిడి ప్రమోషన్స్ అయినా.. ఆకట్టుకునేలా కనబడుతున్నాయి. సినిమా రిలీజ్ కి ఖచ్చితంగా పది రోజులే సమయం ఉంది. నేడు మంగళవారం ఏప్రిల్ 18న ఏజెంట్ ట్రైలర్ కి రంగం సిద్ధమైంది. కాకినాడలో జరగబోయే ఈ వేడుకకి మూవీ టీమ్ మొత్తం హాజరవుతుండగా.. ఇక్కడేం స్పెషల్ గా చేస్తాడో అఖిల్ అని అందరూ ఎదురు చూస్తున్నారు. విజయవాడలో పైనుండి కిందకి దిగి అందరిని అఖిల్ ఆశ్చర్యపరిచాడు.
అయితే పాన్ ఇండియా పాన్ ఇండియా అంటూ ప్రస్తుతం తెలుగు, మలయాళంలో రిలీజ్ చేస్తున్న ఏజెంట్ ట్రైలర్ లో విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీన్స్ తో పాటుగా BGM కూడా హైలెట్ గా నిలవబోతుందట. సురేందర్ రెడ్డి అఖిల్ ని సిక్స్ ప్యాక్ బాడీతోనే చాలా స్టైలిష్ గా చూపించబోతున్నారట. అలాగే ట్రైలర్ లో లాస్ట్ షాట్ అయితే అక్కినేని ఫాన్స్ కే కాదు.. మాస్ ఆడియన్స్ కి కూడా కిక్ ఇవ్వబోతుంది అని తెలుస్తుంది.
మలయాళ స్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో నటించిన ఏజెంట్ లో సాక్షి వైదే హీరోయిన్ గా బ్యూటిఫుల్ గా కనిపించబోతుంది. అక్కినేని ఫాన్స్ ఎప్పుడెప్పుడు ఏజెంట్ ని చూద్దామా.. 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 100 కోట్ల క్లబ్బులో చేరేలా చెయ్యాలని తెగ ఆత్రంగా ఉన్నారు వారు.