మంచు మనోజ్ భూమా మౌనికని రెండో పెళ్లి చేసుకున్నాడు. మార్చి 3 న ఈ జంట పెళ్లి పీటలెక్కింది. ఇప్పటికి ఈ జంట ప్రేమ, పెళ్లి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే నిలుస్తుంది. ఈరోజు మంగళవారం మనోజ్ ఆయన భార్య మౌనికలు వెన్నెల కిషోర్ అలా మొదలయ్యింది షోకి గెస్ట్ లు వచ్చిన ఎపిసోడ్ ఈటీవీలో ప్రసారం కానుంది. ఇంతలోపులో మంచు మనోజ్ భూమా మౌనికతో తన పెళ్లి ఆల్బమ్, వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. మౌనికతో మనోజ్ పెళ్లి ఎలా అంగరంగ వైభవంగా జరిగిందో.. ప్రతి మూమెంట్ ఆ వీడియోలో ఉంది.
మోహన్ బాబు ఆయన కుమర్తె మంచు లక్ష్మి దగ్గరుండి ఈ పెళ్లిని వేడుకగా జరిపించారు. మంచు విష్ణు ఆయన భార్య పెళ్ళికి వచ్చి అక్షింతలు వేశారు. పెళ్ళికి ముందు జరగాల్సిన మంగళ స్నానాలు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఫంక్షన్స్, మెహిందీ వేడుక, సంగీత్ వేడుకలు అన్ని ఫిల్మ్ నగర్ లోని మంచు లక్ష్మి నివాసంలోనే జరిగాయి. పెళ్ళికి వచ్చిన గెస్ట్ లు, పెళ్లి సంబరాలు అన్ని వీడియోలో హైలెట్ అయ్యాయి. దివగంత రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మ, సిద్దు జొన్నలగడ్డ, నిక్కీ గల్రాని, వెన్నెల కిషోర్ మంచు మనోజ్ పెళ్ళిలో సందడి చేసారు.
మౌనికకి మూడు ముళ్ళు వేసి తలంబ్రాలు పోస్తూ మనోజ్ ఆనందంతో కనిపించగా.. మౌనిక ప్రతి ఒక్క మూమెంట్ ని ఎంజాయ్ చేసింది. ఇంత ఆనందంతో కళ్ళ నీళ్లు పెట్టుకున్న మౌనికని మోహన్ బాబు దగ్గరకి తీసుకుని ఓదార్చడం, బిందెలో మనోజ్-మౌనిక పోటీపడి ఉంగరాలు తియ్యడం, మంచు లక్ష్మి, భూమా అఖిల ప్రియలు అరుంధతి నక్షత్రాన్ని చూపించడం ఇలా ప్రతి ఒక్క మూమెంట్ హైలెట్ అవ్వగా.. చివరిలో శివాజ్ఞ అంటూ మౌనిక కొడుకు బాధ్యతలు తీసుకుంటున్నట్టుగా మనోజ్ ప్రకటించడం ఈ పెళ్లి వీడియోలో మరింతగా ఆకట్టుకుంది.