గత రెండు వారాలుగా స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ అయ్యిపోయి బోర్ కొట్టేస్తుంది. రావణాసుర, మీటర్ రెండు సినిమాలు ఏప్రిల్ 7న విడుదలై ఉస్సురమనిపించారు. రెండు సినిమాలు డిసాస్టర్ అవడంతో.. సమంత శాకుంతలమైనా మెప్పిస్తుందేమో అని ఆశపడితే గత శుక్రవారం శాకుంతలం కూడా డిసాస్టర్ అవడంతో ఆడియన్స్ ఆయమన్న సినిమాలు లేక వీకెండ్స్ లో టైమ్ పాస్ అవ్వక బోరింగ్ అంటున్నారు. ఇక ఈ వారం సాయి ధరమ్ తేజ్ కి లక్కీ ఛాన్స్ తగిలింది. ఈ వారం సోలోగా బాక్సాఫీసు దగ్గరకి రాబోతున్నాడు.
రిపబ్లిక్ తో పర్వాలేదనిపించిన సాయి తేజ్.. ఆ సినిమాకి హిట్ టాక్ పడినా కలెక్షన్స్ మాత్రం రాలేదు. ప్రతి ఒక్కరూ దేవకట్ట దర్శకత్వాన్ని, సాయి తేజ్ యాక్టింగ్ ని పొగిడినవారే కానీ.. అది రెవిన్యూ పరంగా వర్కౌట్ అవ్వలేదు. రిపబ్లిక్ ముందు రోడ్ యాక్సిడెంట్ తో సాయి ధరమ్ ప్రమోషన్స్ కి రాలేకపోయాడు. ఇక ఇప్పుడు విరూపాక్ష ప్రమోషన్స్ తో హడావిడి చేస్తున్నాడు. సింగిల్ గా వస్తున్న సాయి తేజ్ విరూపాక్షకి గనక కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చినా సినిమా వర్కౌట్ అయ్యిపోతుంది.
సోలోగా దిగుతున్న విరూపాక్షలో మేటర్ ఉంటే ఆడియన్స్ ఆదరించడం ఖాయం. అసలే స్టూడెంట్స్ కి హాలిడేస్ మొదలైపోయాయి. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సరదాగా మధ్యాన్నం ఓ మ్యాట్నీకి వెళ్లి ఏసీలో విరూపాక్ష చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఈవెనింగ్ అయ్యేసరికి ఐపీఎల్ మ్యాచ్ లతో ఇంట్లో హంగామా చెయ్యడానికి రెడీ అయ్యారు.