ఏపీలో ఎన్నికల నగారా మోగడానికి ఖచ్చితంగా ఏడాది సమయం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న నాలుగు సినిమాల షూటింగ్స్ ఈ ఏడాది కాలంలో ఫినిష్ అవ్వాల్సిందే. ఇప్పటికే హరి హర వీరమల్లు షూటింగ్ ని 75 శాతం మేర పూర్తి చేసిన పవన్ దానిని పక్కనబెట్టి సముద్రఖని-పవన్-సాయి తేజ్ కాంబో PKSDT మూవీ పూర్తి చేసారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, OG షూటింగ్స్ మొదలు పెడుతున్నారు. ఉస్తాద్ ఓ షెడ్యూల్ ఫినిష్ అయ్యింది. OG ఓ షెడ్యూల్ పూర్తయ్యాక మళ్ళీ హరి హర వీరమల్లు షూట్ లోకి వెళ్ళతారట.
ఇలా షిఫ్ట్ ల వైజ్ గా సినిమాలు చేస్తూ ఈ ఏడాది చివరికల్లా షూటింగ్స్ కంప్లీట్ చేసేసి ఎన్నికల కదన రంగంలోకి దూకెయ్యాలి. అంటే ఎన్నికలకు మూడు నెలల ముందు నుండే ఏపీ ప్రజల్లో పవన్ కళ్యాణ్ కనిపించకపోతే 2018 లో జనసేన కి ఎలాంటి పరిస్థితి ఉందో.. 2024 లోను జనసేనకు అదే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజల్లోకి మమేకమైతేనే పవన్ కళ్యాణ్ జనసేనకు హెల్ప్ అవుతుంది. లేదు సినిమాలు చేసుకుంటూ ఎన్నికల్లో పోటీ చేస్తా అంటే ఎవ్వరూ పట్టించుకోరు.
మరి పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్ ల షూటింగ్స్ ఎప్పటికి పూర్తి చేస్తారో.. ఆయన టార్గెట్ రీచ్ అవుతారా అనే డౌట్ లో పవన్ ఫాన్స్ కొట్టుమిట్టాడుతున్నారు. సముద్ర ఖని మూవీ జులై లో విడుదలైపోతుంది. దానితో ఖుషినే. కానీ ఈమూడు సినిమాల పరిస్థితి ఎలా ఉండబోతుందో అనేది ఫాన్స్ అంచనా వేయలేకపోతున్నారు. మరోపక్క సుధీర్ వర్మ పవన్ తో సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. మరి దాని పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.