ఈరోజు ఏప్రిల్ 17 హీరో సిద్దార్థ్ బర్త్ డే. కొద్దిరోజులుగా సినిమాల్లో కనిపించని సిద్దార్థ్ ఇప్పుడు టక్కర్ మూవీలో నటిస్తున్నాడు. సిద్దు బర్త్ డే స్పెషల్ గా టక్కర్ టీజర్ వదిలి ఆయనకి బర్త్ డే విషెస్ చెప్పింది టీమ్. ఇక ఈమధ్యనే సిద్దార్థ్ జీ తెలుగు సింగింగ్ ప్రోగ్రాం లో సందడి చెయ్యడమే కాదు.. సింగర్స్ తో కాలు కదిపి కామెడీ చేసాడు. ఇక సిద్దార్థ్ ప్రస్తుతం అదితి రావు తో డేటింగ్ లో ఉన్నాడు. ఆయనకి ఇంతకుముందే పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు.
కానీ మొదటి భార్యకి విడాకులిచ్చేసి.. ప్రస్తుతం అదితితో డేటింగ్ చేస్తున్న సిద్దు ఆ విషయాన్ని ఒప్పుకోడు. నిన్నటివరకు ఈ జంట తమ డేటింగ్ విషయాన్ని సీక్రెట్ గా ఉంచడమే కాదు.. తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకుని తిరుగుతూ ఫొటోస్ తీసే ఫోటో గ్రాఫర్స్ ని విసుక్కునేవారు. కానీ వీరు మాత్రం రెగ్యులర్ గా హోటల్స్, పార్టీలు, వెకేషన్స్ అంటూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తారు. ఈమధ్యన ఈ జంట కాస్త పబ్లిక్ గానే దర్శనమిస్తుంది.
తాజాగా సిద్దార్థ్ బర్త్ డే కి అదితి రావు తాము విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న వీడియోని షేర్ చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ఆ వీడియోలో అదితి - సిద్దార్థ్ లు అల్లరి చేస్తూ డాన్స్ చేస్తున్నారు. అంతేకాకుండా సిద్దార్థ్ పై తనకున్న ప్రేమని ఈ పుట్టిన రోజు మెసేజ్ తో మొత్తం చూపించేసింది అదితి రావు.