ఆర్.ఆర్.ఆర్ టీం ఆస్కార్ సాధించుకొచ్చాక.. రామ్ చరణ్ అదిరిపోయేలా బర్త్ డే పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీలో రాజమౌళి, కీరవాణి, అక్కినేని, దగ్గుబాటి ఫామిలీస్ కనిపించినా ఎన్టీఆర్ కనిపించలేదు. అదే అక్కడ హాట్ టాపిక్ అయ్యింది. తర్వాత ఎన్టీఆర్ పర్సనల్ గా తన ఇంటి వద్దే పార్టీ ఇచ్చాడు.. అక్కడ చరణ్ కనిపించలేదు. రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి సెలబ్రిటీస్ కనిపించారు. తాజాగా నిన్న రాత్రి కెమేరామ్యాన్ సెంథిల్ ఆర్.ఆర్.ఆర్ టీమ్ సభ్యులకి అదిరిపోయే పార్టీ ప్లాన్ చేసి ఆహ్వానించాడు. మంచు మనోజ్ దంపతులు, లక్ష్మి మంచు స్పెషల్ గా ఈ పార్టీలో కనిపించారు.
రాజమౌళి, కీరవాణి , కార్తికేయ ఫామిలీస్ హాజరై సందడి చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. సెంథిల్ తీసిన సెల్ఫీని పోస్ట్ చేస్తూ ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ పార్టీలో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలంటూ పోస్ట్ చేసాడు. అయితే ఈ పార్టీలో రామ్ చరణ్ కనిపించినా ఎన్టీఆర్ కనిపించకపోవడంపై మరోసారి చర్చ మొదలయ్యింది. ఆస్కార్ తర్వాత ఎన్టీఆర్-చరణ్ మళ్ళీ కలిసి కనిపించించే లేదు అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు.
ఆస్కార్ హడావుడితో ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ ముగిసాయి.. ఇక కలవడం ఎందుకులే అనుకున్నారో.. ఏమిటో.. చరణ్-ఎన్టీఆర్ లు మాత్రం కలవకపోవడం అభిమానుల మనసుని చివుక్కుమనేలా చేస్తుంది. #NTR30 షూటింగ్‌తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఈ పార్టీలో పాల్గొనలేదు.. అని తెలుస్తుంది. కానీ హైదరాబాద్ లోనే జరిగిన పార్టీకి ఎన్టీఆర్ రాకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది.