జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ట్రెండీ పేరు. గ్లామర్ పరంగా సోషల్ మీడియాలో ఎక్కువగా హడావుడి చేసే యంగ్ హీరోయిన్స్ లో జాన్వీ కపూర్ ముందుంటుంది. అందాలు ఆరబోస్తూ అందరి చూపు తనమీదే ఉండేలా చేసుకుంటుంది. ఈమధ్యన చాలామంది జాన్వీ కపూర్ గ్లామర్ షో మొహం మొత్తేలా తయారయ్యింది అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం #NTR30 లో ఎన్టీఆర్ సరసన జోడి కడుతున్న జాన్వీ కపూర్ ఎప్పుడెప్పుడు సెట్స్ లోకి వస్తుందా అని ఎన్టీఆర్ ఫాన్స్ క్యూరియాసిటీతో ఉన్నారు.
ఈమధ్యన జాన్వీ కపూర్ ఓ బాయ్ ఫ్రెండ్ ని కూడా మెయింటింగ్ చేస్తుంది. శిఖర్ తో డేటింగ్ లో ఉన్నప్పటికీ.. ఈ రిలేషన్ ని సీక్రెట్ గా మెయింటింగ్ చేస్తుంది. కానీ శిఖర్ తో చట్టాపట్టాలేసుకుని షికార్లు కొడుతోంది. జాన్వీ కపూర్ శిఖర్ తో కలిసి రీసెంట్ గా తిరుమల వేంకటేశ్వరుని సన్నిధిలో జంటగా కనిపించి షాకిచ్చింది. ఇప్పుడు ముంబై ఎయిర్ పోర్ట్ లో జాన్వీ కపూర్ మరోసారి బాయ్ ఫ్రెండ్ తో దొరికిపోయింది.
జాన్వీ కపూర్, శిఖర్ వేర్వేరుగా ఎయిర్ పోర్ట్ కి వచ్చినా ఇద్దరూ కలిసి ఒకే ఫ్లైట్ లో వెకేషన్స్ కి బయలు దేరారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. #NTR30 సెట్స్ లో జాయిన్ అయ్యేముందు జాన్వీ కపూర్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఓ జాలి వెకేషన్ ని ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది.