Advertisementt

కొరటాల సినిమాలో ఎన్టీఆర్ పాత్ర అదేనా..

Mon 17th Apr 2023 04:24 PM
ntr,koratala,ntr30  కొరటాల సినిమాలో ఎన్టీఆర్ పాత్ర అదేనా..
Is NTR role in Koratala movie? కొరటాల సినిమాలో ఎన్టీఆర్ పాత్ర అదేనా..
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల కాంబోలో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న #NTR30 షూటింగ్ రీసెంట్ గానే స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న #NTR30 షూటింగ్ మరో కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మాస్ గా కనిపించబోతున్నారని ప్రీ లుక్ పోస్టర్ తోనే కొరటాల చూపించేసారు. ఎన్టీఆర్ పాత్ర అతి భయంకరంగా ఉండబోతున్నట్లుగా ఓపెనింగ్ రోజే కొరటాల హింట్ కూడా ఇచ్చేసారు.

అయితే #NTR30 విలన్ విషయంలో సస్పెన్స్ నడుస్తుంది. సైఫ్ అలీ ఖాన్ #NTR30 లో విలన్ పాత్ర వెయ్యబోతున్నారనే న్యూస్ చక్కర్లు కొడుతుండగా.. ఇప్పుడు #NTR30 లో అతి భయానకమైన విలనిజాన్ని ఎన్టీఆర్ చూపించబోతున్నాడట. ఓ మంచి వాడు న్యాయం కోసం చేసే యుద్ధం కన్నా.. ఓ చెడ్డ వాడు అన్యాయంపై చేసే పోరాటమే ఎంతో గొప్పది అనే నేపథ్యంలోనే #NTR30 సాగనుంది అని తెలుస్తుంది. అందరి కన్నా చెడ్డ వాడు అన్యాయన్ని ఎలా అంతం చేశాడు అన్నదే #NTR30 స్టోరీ అంట.

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర కూడా కీలకంగా ఉండబోతుందని, మరో హీరోయిన్ కి ఛాన్స్ ఉంది అంటున్నారు. ప్రస్తుతం కొరటాల భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారట. చక చకా షూటింగ్ కంప్లీట్ చెయ్యాలనే స్పీడుతో ఎన్టీఆర్-కొరటాల ఉన్నారట.

Is NTR role in Koratala movie?:

NTR-Koratala NTR30 update

Tags:   NTR, KORATALA, NTR30
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ