పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉండగా.. సలార్ అప్ డేట్స్ ని మే నుండి మొదలు పెట్టే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. మే లో సలార్ టీజర్ ఇచ్చి తర్వాత జూన్ 16 నుండి అంటే ఆదిపురుష్ రిలీజ్ తర్వాత నుండి పూర్తి ప్రమోషన్స్ తో సలార్ పై క్రేజ్ తెచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈలోపులో సలార్ లో విలన్ గా నటిస్తున్న దేవరాజ్ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపెట్టారు. సలార్ లో ఏడెనిమిదిమంది విలన్స్ ఉన్నారు.
మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ మెయిన్ విలన్ అయితే.. దేవరాజ్ కీలకంగా కనిపించనున్న మరో విలన్, ఇప్పుడాయనే సలార్ పై క్రేజ్ న్యూస్ చెప్పాడు. దేవరాజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సలార్ మూవీ రెండు భాగాలుగానే ఉంటుందనే విషయాన్ని రివీల్ చేసేశారు. ఎప్పటినుండో సలార్ రెండు భాగాలుగా విడుదలకాబోతుంది అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సలార్ రెండు భాగాలు అనే విషయాన్ని ఒక పవర్ఫుల్ పోస్టర్ ద్వారా ప్రశాంత్ నీల్ ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పాలని అనుకున్నాడు. కానీ అంతకంటే ముందే దేవరాజ్ ఈ విషయాన్ని ఇలా రివీల్ చెయ్యడంతో ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారింది.
సెప్టెంబర్ 28 న సలార్ మొదటి భాగాన్ని విడుదల చేసి వచ్చే ఏడాది అయినా లేదంటే 2025 లో అయినా సలార్ రెండో భాగాన్ని విడుదల చెయ్యాలని ప్రశాంత్ నీల్ చూస్తున్నారట.