Advertisementt

చార్మినార్ నైట్ బజార్ లో ఎన్టీఆర్ వైఫ్

Mon 17th Apr 2023 11:42 AM
ntr,charminar night bazaar  చార్మినార్ నైట్ బజార్ లో ఎన్టీఆర్ వైఫ్
NTR wife in Charminar Night Bazaar చార్మినార్ నైట్ బజార్ లో ఎన్టీఆర్ వైఫ్
Advertisement
Ads by CJ

హైదరాబాద్ లో రంజాన్ మాసంలో చార్మినార్ వద్ద నైట్ బజార్ నడుస్తుంది. రంగురంగుల బట్టలు, గాజుల గలగలలు, రకరకాల ఫుడ్ టేస్ట్ లతో పాటుగా హలీం తింటూ నైట్ బజార్ ని ఎంజాయ్ చేస్తారు. కేవలం రంజాన్ ఉపవాస దీక్షలు చేస్తూ ఉండే ముస్లిమ్స్ మాత్రమే కాదు హైదరాబాద్ వాసులు కూడా నైట్ బజార్ కి క్యూ కడుతూ అక్కడ సందడి చెయ్యడమే కాదు.. సెల్ఫీలు తీసుకుంటూ సోషల్ మీడియాలో నైట్ బజార్ హంగామని ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే చార్మినార్ నైట్ బజార్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వైఫ్ మెరవడం అభిమానులకి ఆనందాన్నిచ్చింది. రద్దీగా ఉండే చార్మినార్ నైట్ బజార్ ఏరియాల్లో ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి షాపింగ్ చేస్తూ కనిపించడంతో వదినమ్మ లక్ష్మి ప్రణతి అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ ఉత్సాహంగా ఆ పిక్ ని ట్రెండ్ చేస్తున్నారు. అయితే నిజంగానే లక్ష్మి ప్రణతి చార్మినార్ లో నైట్ బజార్ లో కనిపించినట్లుగా.. ఈపిక్ ఎన్టీఆర్ ఫాన్స్ కి ఎక్కడ దొరికిందో కానీ తెగ ట్రెండ్ చేస్తున్నారు.

డిసెంబర్ లో పిల్లలతో సహా ఒక నెలపాటు భర్త ఎన్టీఆర్ తో అమెరికాలో ఎంజాయ్ చేసిన ప్రణతి.. తర్వాత ఆస్కార్ అప్పుడు కూడా అమెరికా వెళుతుంది అనుకున్నారు. కానీ పిల్లలని చూసుకోవాల్సి ఉంది అందుకే ఆమె రాలేదంటూ ఎన్టీఆర్ తన ఫాన్స్ ని నిరుత్సాహపరిచారు. 

NTR wife in Charminar Night Bazaar:

NTR wife Lakshmi Pranthi in Charminar Night Bazaar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ