రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తప్ప పెద్దగా సినిమాల విషయంలో వినబడని పేరు. ఇండియన్ 2 లో నటిస్తున్నా రకుల్ ప్రీత్ ఎందుకో ఆ సినిమా ముచ్చట ఎక్కడా బయటికి రానివ్వడం లేదు. కాజల్ అగర్వాల్ మాత్రం ఇండియన్ 2 షూటింగ్ సెట్స్ నుండి NBK108 సెట్స్ లోకి జాయిన్ అవడం, సోషల్ మీడియాలో కాజల్ అందాలను ఎక్కువగా ట్రెండ్ చెయ్యడంతో ఆమె హైలెట్ అవుతుంది కానీ.. రకుల్ ఈ సినిమా విషయంలో అంతగా క్రేజీగా కనిపించడం లేదు.
బాలీవుడ్ లో మాత్రం జాకీ భగ్నానీ ప్రేమలో మునిగి తేలుతున్న రకుల్ ప్రీత్ ఎవరైనా పెళ్లి పేరెత్తగానే ఫైర్ అవుతుంది. అలాగే సినిమా అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ.. రకుల్ గ్లామర్ షో తో మాత్రం వేరే లెవల్ అంటూ అదిరిపోయే ఫోటో షూట్స్ తో అదరగొట్టేస్తుంది. తాజాగా రెడ్ కలర్ లాంగ్ ఫ్రాగ్ లో థైస్ అందాలు చూపిస్తూ రకుల్ చేసిన గ్లామర్ షో మతిపోగొట్టే విధంగా ఉంది. ఈ అవుట్ ఫిట్ లో అందాల దేవకన్యలా రకుల్ ప్రీత్ మెరిసిపోతుంది. HallO HallOf Fame ఈ ఫోటో షూట్ అంటూ రకుల్ ఆ పిక్స్ ని షేర్ చేసింది.
సోషల్ మీడియాలో అందాలని ఎంతగా ఎక్స్ పోజ్ చేస్తున్నా రకుల్ ప్రీత్ కి అవకాశాలు మాత్రం అంతంతమాత్రంగానే కనబడుతున్నాయి. గ్లామర్ షో కూడా ఆమెకి సింగిల్ ఆఫర్ తెచ్చిపెట్టడం లేదు. ఆఖరికి సీనియర్ హీరోలు కూడా రకుల్ ని కన్సిడర్ చెయ్యడమే లేదు.