గత శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చిన రావణాసురపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నప్పటికీ.. ఆ అంచనాలను నిలబెట్టుకోవడంలో రవితేజ పూర్తిగా విఫలమయ్యాడు. ధమాకా, వాల్తేర్ వీరయ్య సూపర్ హిట్స్ అవడంతో రవితేజ రావణాసురపై ఆడియన్స్ లో హైప్ క్రియేట్ అయ్యింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రావణాసురకి ఆడియన్స్ నుండి తీవ్ర వ్యతిరేఖత ఏర్పడింది. మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే ఉన్నా.. రెండో రోజునుండే రావణాసుర కలెక్షన్స్ పడిపోయాయి.
థియేటర్స్ లో డిసాస్టర్ కలెక్షన్స్ తో ఆడుతున్న రావణాసురని అనుకున్న దానికన్నా ముందుగానే ఓటిటిలోకి తీసుకొచ్చేస్తున్నారట మేకర్స్. నిర్మాతకు కొంత ఎమౌంట్ ఇచ్చిన ఓటీటీలో అడ్వాన్స్ రిలీజ్ కు సిద్ధమయినట్లు తెలుస్తోంది. ధమాకా, వాల్తేర్ వీరయ్యలు హిట్స్ తో ఈ చిత్రాన్ని భారీ ధరకి అమెజాన్ ప్రైమ్ వారు కొనుగోలు చెయ్యడటంతో ఇప్పుడు వీరు అనుకున్న సమయం కన్నా ముందుగానే అంటే ఏప్రిల్ నెల ఆఖరులో స్ట్రీమింగ్ చేయడానికి రెడీ అవుతున్నారట.
హిట్ అయితే రెండు నెలల సమయం ఫట్ అయితే నెలతిరిగే లోపులోనే సినిమాలు ఓటిటికి వచ్చేస్తున్న నేపథ్యంలో ప్లాప్ గా నిలిచిన రావణాసురని కూడా త్వరగా ఓటిటిలోకి దించే ప్లాన్స్ మొదలైనట్లుగా టాక్.