Advertisementt

పెళ్లి పీటలేక్కబోతున్న సుడిగాలి సుధీర్

Mon 17th Apr 2023 09:36 AM
sudigali sudheer  పెళ్లి పీటలేక్కబోతున్న సుడిగాలి సుధీర్
Is Sudigali Sudheer Getting Married పెళ్లి పీటలేక్కబోతున్న సుడిగాలి సుధీర్
Advertisement
Ads by CJ

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫెమస్ అయ్యి ఢీ డాన్స్ షో తో వేరే లెవల్ కామెడీ చేస్తూ శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రత్యేకతని చూపుతూ యాంకరింగ్ చేసిన సుడిగాలి సుధీర్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈటీవికి దూరంగా సిల్వర్ స్క్రీన్ కి దగ్గరగా కనిపిస్తున్నాడు. హీరోగా సినిమా అవకాశాలతో బుల్లితెరకు దూరంగా ఉంటున్న సుడిగాలి సుధీర్ ఆ బుల్లితెర మీద యాంకర్ రష్మితో నడిపిన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్కౌట్ అవడంతో తొందరగా ఫెమస్ అయ్యాడు. అయితే వాళ్ళమధ్యలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ తప్ప అఫ్ స్క్రీన్ రొమాన్స్ లేదు, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ ఉంటారు.

అటు రష్మీ పెళ్ళి చేసుకోలేదు, ఇటు సుధీర్ 35 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఇంకా అలానే ఉండిపోయాడు. ఆయన తమ్ముడికి కూడా పెళ్లయిపోయింది. అయితే తాజాగా సుడిగాలి సుధీర్ పెళ్లి వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సుధీర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన రిలేటివ్స్ లోనే ఓ అమ్మాయితో సుధీర్ ఏడడుగులు నడిచేందుకు సిద్దమయ్యాడనే న్యూస్ వైరల్ అయ్యింది.

అయితే సుధీర్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నాడు. ఆ అమ్మాయి ఎవరు అనేది మాత్రం పెళ్లి వరకు సీక్రెట్ గా ఉంచాలని చూస్తున్నాడట. మరి నిజంగా సుధీర్ పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైతే వాళ్ళ తల్లితండ్రులకన్నా ఎక్కువగా ఆయన అభిమానులే సంతోష పడిపోతారు.

Is Sudigali Sudheer Getting Married:

Sudigali Sudheer Marriage Fixed?

Tags:   SUDIGALI SUDHEER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ