పవన్ కళ్యాణ్ లైనప్ చూస్తే ఫాన్స్ కి మతి పోతుంది. ఏకంగా నాలుగు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. దానితో ఫాన్స్ కి పిచ్చెక్కిపోతుంది. కొత్త సినిమాల అప్ డేట్స్ తో ఫాన్స్ నిద్రపోవడం లేదు. హరి హర వీరమల్లు షూటింగ్ హోల్డ్ లో పెట్టి ఉస్తాద్ భగత్ సింగ్ రెగ్యులర్ షూట్ షురూ చెయ్యడమే కాదు.. మేనల్లుడు సాయి తేజ్ తో నటిస్తున్న మూవీ షూటింగ్ ఫినిష్ చేసి ఆశ్చర్యపరిచారు. మరోపక్క సుజిత్ OG షూటింగ్ రంగం సిద్ధం చేయడమేనా.. ఓ వీడియోతో ఫాన్స్ మదిని కొల్లగొట్టాడు.
ఈ నెల 18 నుండి పవన్ కళ్యాణ్ ముంబై వెళ్లి OG షూట్ లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. అలాగే OG ఓ షెడ్యూల్ అయ్యాక హరి హర వీరమల్లు సెట్స్ లోకి పవన్ వస్తారట. ఇదంతా ఇప్పటికీ నమ్మలేకపోతున్న పవన్ ఫాన్స్ కి ఇప్పుడో న్యూస్ కంటి మీదకి నిద్ర రానివవడమే లేదు. రావణాసురతో బిగెస్ట్ డిసాస్టర్ ఇచ్చిన సుధీర్ వర్మతో పవన్ ఒక సినిమా చేయబోతున్నారనే న్యూస్ పవన్ ఫాన్స్ కి కునుకు రానివ్వడం లేదు, అస్సలు నచ్చడం లేదు.
సుధీర్ వర్మతో పవన్ కళ్యాణ్ ఓ రీమేక్ కి శ్రీకారం చుట్టబోతున్నారని, త్వరలోనే ఈ సినిమా కూడా పవన్ మొదలు పెట్టేస్తారంటూ ఈ రోజు సాంఘీక మద్యమాల్లో వైరల్ అయ్యింది. అయితే డిసాస్టర్ డైరెక్టర్ కి పవన్ నిజంగానే అవకాశం ఇచ్చారా అనేది ఫాన్స్ అనుమానం. అందుకే పవన్ ఇది నిజమా అని ప్రశ్నిస్తున్నారు.