గ్లామర్ పరంగా హద్దులు దాటేసి కనిపించే శోభిత దూళిపాళ్ల బోల్డ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తెలుగులో అప్పుడప్పుడు కనిపించే ఈ తెలుగమ్మాయి పేరు బాలీవుడ్ లోనే కాదు.. హాలీవుడ్ లోనూ గట్టిగానే వినిపిస్తుంది. అయితే ఈమధ్యన సినిమాల కన్నా ఎక్కువగా నాగ చైతన్య తో ఎఫ్ఫైర్ న్యూస్ లతో మీడియాలో ట్రెండ్ అవుతున్న శోభిత దూళిపాళ్ల.. రీసెంట్ గా సిస్టర్ సమంత పెళ్ళిలో హడావిడి చేసింది.
గత ఏడాది శోభిత దూళిపాళ్ల-నాగ చైతన్య వెకేషన్స్ కి వెళ్లారంటూ కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చెయ్యగా.. ఈ ఏడాది చైతు-శోభితలు కలిసి లండన్ వెళ్లారు, అక్కడ ఇద్దరూ ఒకే హోటల్ లో ఉన్నారంటూ ఓ పిక్ ని చూపిస్తూ వాళ్ళ మధ్యన డేటింగ్ నడుస్తుంది.. ఇది నిజమంటూ బల్లగుద్ది చెబుతున్నారు. అదలా ఉంటే.. తాజాగా శోభిత దూళిపాళ్ల రెడ్ శారీలో, బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ తో మెస్మరైజ్ చేసింది.
ఆమె ఆ రెడ్ కలర్ సారీలో బ్యూటిఫుల్ గాను, గ్లామర్ గాను చాలా అంటే చాలా స్టయిల్ గా కూర్చుని ఉంది. శోభిత దూళిపాళ్ల రెడ్ సారీ లుక్ సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చక్కర్లు కొడుతోంది.