తెలుగు హీరోయిన్ అంజలి ప్రస్తుతం కోలీవుడ్ లో సెటిల్ అయినా అడపా దడపా తెలుగు సినిమాల్లోనూ కనిపిస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత అంజలి కెరీర్ టర్న్ అవ్వుద్ది అనుకుంటే ఆమె అవకాశాలు కోసం వెయిట్ చెయ్యాల్సి వచ్చింది. తర్వాత కోలీవుడ్ మూవీస్ తో కాస్త ఫెమస్ అయినా.. మధ్యలో కుటుంబ కలహాలతో అంజలి కొద్దిరోజులు సినిమాలకి దూరమైంది. మళ్ళీ ఐటెం సాంగ్స్ లోను, వెబ్ సీరీస్ ల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
గ్లామర్ డాల్ గా, బరువు తగ్గి అందాలు చూపిస్తున్నా ఈ తెలుగమ్మాయికి అవకాశాలు కొరతగా ఉంది. వెబ్ సీరీస్ ల్లో ఝాన్సీతో మెప్పించిన అంజలి ఈమధ్యన పెళ్లి పీటలెక్కబోతుంది. కుటుంబ గొడవలు ఓ కొలిక్కి రావడంతో అంజలి పెద్దలు కుదిర్చిన వివాహానికి రెడీ అయ్యింది అంటున్నారు. గతంలో హీరో జై ని ప్రేమించిన అంజలి తర్వాత జై తో బ్రేకప్ చేసుకుని సింగిల్ గానే ఉంటుంది. అయితే కొద్దిరోజులుగా అంజలి పెళ్లి వ్యవహారం సోషల్ మీడియాలో వినబడుతుంది.
తాజాగా అంజలి షేర్ చేసిన మెహిందీ పిక్స్ చూస్తుంటే నిజంగానే అంజలి పెళ్లి చేసుకోబోతుందా.. గుట్టు చప్పుడు కాకుండా హడావిడి లేకుండా పెళ్లి పీటలెక్కుతుందా అనే అనుమానంలో నెటిజెన్స్ కొట్టేసుకునేవారే. అయితే అంజలి మెహిందీ పిక్స్ షేర్ చేసి తమిళ ఉగాదికి అందరికి శుభాకాంక్షలు తెలిపింది. లేదంటే నిజంగానే అంజలి పెళ్లి పీటలెక్కేసిందేమో అనుకునేవారు అందరూ.