గత ఏడాది ప్లాప్ లు ఉన్నప్పటికీ లెక్క చెయ్యని పూజ హెగ్డే ఈఏడాది సల్మాన్ ఖాన్ తో బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టే కసితో కనిపిస్తుంది. సల్మాన్ ఖాన్ తో కలిసి కిసి కా భాయ్ కిసి కా జాన్ ప్రమోషన్స్ లో రెచ్చిపోతుంది. గ్లామర్ గా డ్రెస్సులతోనే కాదు. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, సల్మాన్ తో అసలే డేటింగ్ లో లేనని సింగిల్ స్టేటస్ ని మెయింటింగ్ చేస్తున్నట్లుగా చెబుతున్న పూజ హెగ్డే చాలా హుషారుగా కనబడుతుంది.
కిసి కా భాయ్ కిసి కా జాన్ గనక హిట్ అయితే పూజ హెగ్డే మరోసారి రెచ్చిపోతుంది. ఇప్పటికైతే తెలుగులో మహేష్ బాబుతో SSMB28 తప్ప మరో క్రేజీ ప్రాజెక్ట్ లేదు. ఇక హిందీలోనూ ఒకటి రెండు ప్రాజెక్ట్స్ తప్ప పూజా హెగ్డే కి సినిమా అవకాశాలు వెతుక్కుంటూ రావడం లేదు. అందుకే ఇప్పుడు కిసి కా జాన్ తో హిట్ కొట్టాలని చెప్పేది. ఒకవేళ ఈ సినిమా కూడా పొతే.. పూజ హెగ్డే కొద్దిరోజులు సైలెంట్ గా కనిపించడం ఖాయం.
ఏది ఏమైనా ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా పూజా హెగ్డే మాత్రం రొమాంటిక్ యాంగిల్ చూపించేస్తుంది. ప్రస్తుతం గ్లామర్ అవుట్ ఫిట్స్ తో చేయించుకుంటున్న ప్రమోషనల్ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హడావిడి మొదలు పెట్టేసింది.