నిన్నటివరకు అక్కినేని ఫాన్స్ ఉడికిపోయారు. ఏం చెయ్యాలో తెలియక తల పట్టుకుని కూర్చున్నారు. కారణం విడాకుల తర్వాత సమంత సక్సెస్ లతో దూసుకుపోతుంటే.. నాగ చైతన్య ఫైయిల్యూర్స్ తో కొట్టుమిట్టాడుతున్నాడు. మరోపక్క సమంత మీద పెరుగుతున్న సింపతీ చూసిన వారు మరింత రగిలిపోయారు. అటు నాగార్జునకి ఫెయిల్యూర్స్ ఇటు అఖిల్ సినిమా పోస్ట్ పోన్ మీద పోస్ట్ పోన్. నాగ చైతన్య సైలెంట్ గా ఉన్నాడు కానీ.. ఫాన్స్ మాత్రం ఆగ్రహంతో ఊగిపోయారు.
కానీ ఇప్పుడు వారు చల్లబడ్డారట.. కారణం సమంత శాకుంతలం సినిమాకి వచ్చిన టాక్ తో వారు కూల్ అవుతున్నారట. సమంత నాగ చైతన్యతో విడాకుల తర్వాత పుష్ప ఐటెం సాంగ్ లో విపరీతమైన ఎక్స్ పోజింగ్ చేసింది. ఆ సినిమానే కాదు ఆ పాట కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అలాగే ఆమె నటించిన యశోద మంచి హిట్ అయ్యింది. మరోపక్క సినిమాల మీద సినిమాలు ఒప్పేసుకుంది. విడాకుల తర్వాత సమంత కెరీర్ పరుగులు పెట్టింది. సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్ లతో నాగ చైతన్య ని బాడ్ చేసింది. అలాగే శాకుంతలం ప్రమోషన్స్ లోను చైతూపై ఇండైరెక్ట్ కామెంట్స్ చేసింది.
నాగ చైతన్య విడాకుల తర్వాత కెరీర్ బాగా డల్ అయ్యింది. థాంక్యూ డిసాస్టర్, దూత డిజిటల్ ఎంట్రీపై రాని క్లారిటీ.. ఇలా అక్కినేని ఫాన్స్ సమంత విషయంలో రగిలిపోయారు. ఇప్పుడు శాకుంతలం దెబ్బకి సమంత కామ్ గా కూర్చోవాలి. ఆ సినిమాకొస్తున్న కలెక్షన్స్ చూసి కామెడీ చేస్తున్న నెటిజెన్స్. శాకుంతలం డిసాస్టర్ సమంతకి పెద్ద దెబ్బ. దానితో అక్కినేని అభిమానులకు భారీ ఊరట కలిగింది అంటూ సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ లు చక్కర్లు కొట్టడం సమంత ఫాన్స్ ని ఇబ్బంది పెడుతున్నాయి.