కోలీవుడ్ నటి స్నేహ ఆమె భర్త ప్రసన్నతో విడిపోతుంది అంటూ చాన్నాళ్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త. వారిద్దరూ మనస్పర్ధల కారణంగా స్నేహ పిల్లలతో కలిసి వేరుగా ఉంటుంది, ముఖ్యంగా ఆమె హైదరాబాద్ లోనే ఉండడానికి ఇష్టపడుతుంది అంటూ ఏవేవో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. స్నేహ కూడా ఈ టివిలో వస్తున్న మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రోగ్రాం కోసం తరచూ హైదరాబాద్ కి రావడంతో ఈ విడాకుల వార్తలకి బలం చేకూరాయి.
అయితే మధ్యలో స్నేహ తన భర్త ప్రసన్నతో కలిసి ఉన్న పిక్స్ వదిలినా ఎందుకో ఏమో విడాకుల వార్తలు మాత్రం ఆగలేదు. మంచిగా అన్యోన్యంగా ఉన్న జంటని కూడా ఇలా సోషల్ మీడియాలో రూమర్ అనే జబ్బు విడగొట్టి వేడుక చూస్తుంది. నెటిజెన్స్ కూడా పొరబాటున ఆ రూమర్స్ ని నమ్మేస్తూ విడాకులైనా, ఏదైనా నమ్మేసి కామెంట్స్ చెయ్యడం ఫ్యాషన్ గా మారిపోయింది.
అయితే స్నేహ ఆమె భర్త ప్రసన్నలు విషు ఫెస్టివల్ సందర్భంగా దిగిన ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇద్దరూ ఎంతో సఖ్యతగా, ప్రేమగా, నవ్వుతూ హగ్ చేసుకున్న ఫొటోస్ అవి. మరి ఈ ఫొటోస్ చూసి వాళ్ళ మధ్యన ప్రేమే కానీ.. విడాకులు జరగవు. స్నేహ-ప్రసన్న విడాకుల న్యూస్ లు జస్ట్ రూమర్ అని ఫిక్స్ అయ్యేలా ఈ సాక్ష్యాలు ఉన్నాయి. నెటిజెన్స్ ఇప్పటికైనా నమ్ముతారా.. స్నేహ-ప్రసన్నలు విడాకులు తీసుకోవడం లేదని.