హీరో నాని రగ్గడ్ లుక్ లో కనిపించి మాస్ గా ప్రేక్షకులని మెప్పించిన దసరా ఇంకా ఇంకా థియేటర్స్ లో కలెక్షన్స్ వర్షం కురిపిస్తూనే ఉంది. టాప్ సెలబ్రిటీస్ నుండి దసరాకి అందుతున్న ప్రశంశలతో టీం ఇప్పటికి ఉక్కిరిబిక్కిరి అవుతుంది. మెగాస్టార్ చిరు దగ్గర నుండి ప్రభాస్, మహేష్ బాబు లాంటి హీరోలు దసరాని పొగిడేశారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ చిత్రం 100 కోట్ల క్లబ్బులోకి చేరిపోయింది.
విడుదలై మూడు వారాల్లోకి అడుగుపెట్టిన దసరాని ఇంకా ఆడియన్స్ ఆదరిస్తున్నారు. రెండు వారాలుగా విడుదలవుతున్న చిత్రాలేవీ ఆడియన్స్ ని మెప్పించకపోవడంతో.. చాలామంది దసరా థియేటర్స్ కి క్యూ కట్టడంతో థియేటర్స్ లో ప్రేక్షకుల సందడి కనబడుతుంది. అయితే మార్చ్ 30 న శ్రీరామ నవమి సందర్భంగా విడుదలైన దసరాకి ఓటిటి పార్ట్నర్ గా నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని డిజిటల్ స్ట్రీమింగ్ చేయనుంది.
అయితే నెట్ ఫ్లిక్స్ నుండి దసరా వచ్చే మే 30న అని తెలుస్తుంది. అంటే ఎనిమిది వారాల తర్వాతే దసరాని ఓటిటి ప్రేక్షకులు చూసేందుకు రెడీ అవుతుంది అంటున్నారు. దసరా హిట్ అవడంతో మేకర్స్ రెండు నెలల తర్వాతే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చెయ్యాలని నిర్ణయించుకున్నారట.