సమంత.. సమంత, ఆ పేరు పాన్ ఇండియా మర్కెట్ లో మోగిపోవడంతో సమంతని గుడ్డిగా నమ్మేసి శాకుంతలం సినిమా చేసారు. అది కూడా పాన్ ఇండియా మూవీగా పలు భషాల్లో 3D హంగులద్ది మరీ దించారు. అయితే సమంతకి క్రేజ్ ఉంటే సరిపోతుందా.. అందులో కంటెంట్ కానీ, గ్రాఫిక్స్ కానీ, మ్యూజిక్ కానీ ఏమి లేకపోయినా సినిమా హిట్ అవుతుందా.. అసలే అవుట్ డేటెడ్ ఆలోచనలతో ఈ కాలంలో సినిమాని హిట్ చెయ్యడం కుదురుతుందా.. కుదరదు అనేది గుణశేఖర్ శాకుంతలం నిరూపించింది.
సమంత స్టామినా, ఆమె పాన్ ఇండియా క్రేజ్ ని వాడుకుందామని అడ్డంగా బుక్ అయ్యారు గుణశేఖర్ బ్యాచ్. సినిమాలో విషయం లేదు. థ్రిల్ అనిపించే ప్రేమ కథలేదు, ఆసక్తికర సంభాషణలు లేవూ.. అద్భుతమైన గ్రాఫిక్స్ లేవు. కళ్ళు చెదిరే యుద్ధ సన్నివేశాలు లేవు. సమంత మెరుపులు లేవు, ఆమె ఫేస్ లో గ్లో లేదు, డబ్బింగ్ కి ఆమె వాయిస్ కుదరలేదు, శకుంతలగా సమంత సూట్ అవ్వనే లేదు.
ఆమె క్రేజ్ ఫ్యామిలీ మ్యాన్ తో పలు భాషలని తాకింది. దానితో యశోద గట్టెక్కేసినా.. శాకుంతలాన్ని పాన్ ఇండియా ప్రేక్షకులు తిరస్కరించారు. కనీసం సమంత కోసమైనా సినిమా చూద్దామనుకున్నవారికి ఆ సమంతనే నిరాశ పరిచింది. దానితో ప్రేక్షకులు మరింతగా డిస్పాయింట్ అవుతున్నారు.