రష్మిక మందన్న సక్సెస్-ప్లాప్ లతో సంబంధం లేకుండా మోగిపోతున్న పేరు. హీరోయిన్ గా ఎంతగా హైలెట్ అవ్వాలో అంతగా హైలెట్ అవుతున్న రష్మిక.. ఈమధ్యన ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మోనిలో చేసిన డాన్స్ తో మరింత హాట్ టాపిక్ గా మారింది. కానీ నెటిజెన్స్ నుండి ఇప్పటికి రష్మిక పై ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. ఆమె ఎలా నచ్చిందిరా బాబు, ఆమె అబ్బాయిలా ఉంటుంది. అస్సలు అందంగా ఉండదు. పుష్ప లో శ్రీవల్లి గా డీ గ్లామర్ రోల్ లో చూడలేక చచ్చాం, ఆమె థై షో కూడా ఇంప్రెసివ్ గా ఉండదు, గ్లామర్ లుక్ కూడా ఉండదు అంటూ కామెంట్స్ చేస్తూనే ఉంటారు.
ఎనర్జీకి మారుపేరు రష్మిక, ఆమెకి లక్ తప్ప ఇంకేం లేదు అనేవారు ఉన్నారు. అయినా రష్మిక క్రేజీగా దూసుకుపోతుంది. నేషనల్ క్రష్ గా మారిన రష్మిక ఇప్పుడు ఐఎండీబీ తాజా ర్యాంకులో మూడో స్థానాన్ని ఆక్రమించింది. అల్లు అర్జున్ ని వెనక్కి నెట్టి మరీ రష్మిక మూడో ప్లేస్ లోకి రావడం చాలామందికి షాకిచ్చింది. ఈమధ్యనే పుష్ప2 గ్లింప్స్ రావడం, ఆమె బర్త్ డే సెలెబ్రేషన్స్ కారణంగా.. గూగుల్, ఇంటర్నెట్ లో రష్మిక ట్రెండ్ అవడమే ఆమెకి ఈ ర్యాంక్ మెరుగు అవడానికి కారణంగా చెబుతున్నారు.
తెలుగులో ఒక సినిమా, తమిళ్ లో ఒక సినిమా మొదలు పెట్టి ఈమధ్యన మరింత క్రేజీగా మారిపోయింది. బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తోనూ సందడి చేస్తున్న రష్మిక ఐఎండీబీ తాజా ర్యాంకింగ్ లో మూడో స్థానం రావడంతో ఆమె అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతుంటే.. ఎందుకురా ఈ పిల్లకి ఇంత క్రేజ్ అంటూ ఆమెని తెగిడేవాళ్లు మాట్లాడుకుంటున్నారు.