Advertisementt

చైతు డిజిటల్ ఎంట్రీ ఏమైంది

Sun 16th Apr 2023 09:40 AM
amazon prime video,naga chaitanya,dhootha  చైతు డిజిటల్ ఎంట్రీ ఏమైంది
What happened to Naga Chaitanya digital entry? చైతు డిజిటల్ ఎంట్రీ ఏమైంది
Advertisement
Ads by CJ

థాంక్యూ డిసాస్టర్ తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నాగ చైతన్య కష్టడితో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం కష్టడి ప్రమోషన్స్ తో హడావిడి చేస్తున్న నాగ చైతన్య డిజిటల్ ఎంట్రీ దూత్ వెబ్ సీరీస్ అసలు ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ లేకుండా పోయింది. థాంక్యూ మూవీ చేస్తున్నప్పుడే విక్రమ్ కుమార్ దూత వెబ్ సీరీస్ చేసారు. అది షూటింగ్ కూడా ఫినిష్ చేసుకుంది కానీ.. ఆ సీరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడో మేకర్స్ చెప్పడం లేదు.

అయితే థాంక్యూ డిసాస్టర్ అయ్యింది.. ఇప్పుడు దూత స్ట్రీమింగ్ చేస్తే వర్కౌట్ అవ్వదని భావించి అమెజాన్ ప్రైమ్ వారు దానిని ఆపేసినట్లుగా తెలుస్తుంది. నాగ చైతన్య రీసెంట్ మూవీ కష్టడి రిలీజ్ అయ్యాక ఆ సినిమా ఫలితాన్ని బట్టి దూత విడుదలకు ప్లాన్ చేస్తారేమో అనుకుంటున్నారు. కష్టడి రిజల్ట్ పైనే దూత భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నమాట. 

నాగ చైతన్య డిజిటల్ ఎంట్రీ సక్సెస్.. లేదా ప్లాప్ అనేది ఇంకొంత కాలం వెయిట్ చేస్తే కానీ తెలియదు.

What happened to Naga Chaitanya digital entry?:

Amazon Prime Video Puts Release of Naga Chaitanya Dhootha 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ