Advertisementt

OG వీడియోతోనే గూస్ బమ్ప్స్ తెప్పించారు

Sat 15th Apr 2023 04:58 PM
pawan kalyan,og  OG వీడియోతోనే గూస్ బమ్ప్స్ తెప్పించారు
Pawan Kalyan Fire Storm Is Coming With OG OG వీడియోతోనే గూస్ బమ్ప్స్ తెప్పించారు
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ స్పీడు చూస్తే ఏడాదికి రెండు సినిమాలు దించే ప్లాన్ లో కనిపిస్తున్నారు. భీమ్లా నాయక్ తర్వాత హరి హర వీరమల్లు మీదే ఉంటారనుకుంటే.. పవన్ కళ్యాణ్ మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్, సముద్రఖనితో రీమేక్, సుజిత్ తో ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ షూటింగ్స్ మొదలు పెట్టేసి చకచకా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి షెడ్యూ పూర్తయినట్లుగా మేకర్స్ అప్ డేట్ ఇచ్చిన సాయంత్రానికే సుజిత్ OG నుండి వీడియో వదిలాడు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ మూవీ ముంబై పరిసర ప్రాంతాల్లో మొదలు కాబోతుంది అంటూ ఆ వీడియోతో హింట్ ఇచ్చారు. 

ఈరోజు OG నుండి దూసుకొచ్చిన వీడియో చూస్తే నిజంగా పవన్ ఫాన్స్ కి గూస్ బంప్స్ వచ్చేసి ఉంటాయి. పవన్ కళ్యణ్ కి ఎలాంటి సినిమా పడాలో.. అలాంటి సినిమా OG అని పవన్ ఫాన్స్ ఫిక్స్ అయ్యేలా ఉందా వీడియో. ఫాన్స్ కి హుషారెత్తించే వీడియో అది. అసలు షూట్ మొదలవ్వకముందే సినిమాపై విపరీతమైన అంచనాలను క్రియేట్ చేసే వీడియో వదిలారు. థమన్ BGM హైలెట్, సుజిత్ మేకింగ్ హైలెట్, యాక్షన్ సీన్స్ కి సంబందించిన ఆయుధాలని పరిచయం చేసే వీడియో అది. 

గన్ సౌండ్, బాంబు వదలడం.. అన్ని స్టైలిష్ గా, ఫాన్స్ కి కిక్ ఇచ్చేలా ఈ వీడియోలో ఉన్నాయి. సుజిత్ OG షూటింగ్ స్టార్టింగ్ నుండే సినిమాపై అంచనాలను ఆకాశంలో కూర్చోబెట్టేసాడు. పవన్ లుక్ బయటికి వస్తే ఫాన్స్ ఏ విధంగా రెచ్చిపోతారో చూడాలి.

Pawan Kalyan Fire Storm Is Coming With OG:

Pawan Kalyan Is Joining The Sets Of OG 

Tags:   PAWAN KALYAN, OG
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ