Advertisementt

నయన్ తో లవ్ అలా మొదలయ్యింది: విగ్నేష్

Sat 15th Apr 2023 04:04 PM
nayanthara,vignesh shivan  నయన్ తో లవ్ అలా మొదలయ్యింది: విగ్నేష్
Vignesh Shivan about his love story నయన్ తో లవ్ అలా మొదలయ్యింది: విగ్నేష్
Advertisement
Ads by CJ

విగ్నేష్ శివన్-నయనతార ఎనిమిదేళ్లు ప్రేమించుకుని తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నా ఎవరికీ చెప్పకుండా సీక్రెట్ ని మెయింటింగ్ చేస్తూ గత ఏడాది అధికారికంగా అంగరంగ వైభవంగా వివాహం చేసుకుని సరోగసి ద్వారా కవలలకు తల్లితండ్రులయిన విషయం తెలిసిందే. అయితే నయనతార-విగ్నేష్ శివన్ లు విగ్నేష్ డైరెక్ట్ చేసిన నేనూ రౌడీనే షూటింగ్ అప్పటినుండి ప్రేమించుకున్నారని తెలుసు. తాజాగా విగ్నేష్ శివన్ నయనతారతో తన ప్రేమ ఎప్పుడు మొదలైందో చెప్పాడు. నేనూ రౌడీనే సినిమా మొదలు కావడానికి ముందే తాను నయన్ తో ప్రేమలో పడినట్లుగా చెప్పాడు.

పోడాపోడి సినిమా ఫెయిల్యూర్ తర్వాత హిట్ కొట్టాలనే కసితో.. నేను నేను రౌడీనే కథ రాసాను. నా దగ్గర కథ ఉందని తెలుసుకుని ధనుష్ ఆ సినిమాని ప్రొడ్యూస్ చేస్తా అన్నారు. ఆ కథ నయనతారకి సెట్ అవ్వుద్ది ఆమెకి వినిపించమని ధనుష్ చెప్పారు. కానీ నాకు నయనతార చేస్తుందో, లేదో.. నజ్రీయాకి చెబుదామనికుని.. ధనుష్ మాట మీద నయన్ ని కలిసాను. నయనతార కి కథ చెప్పేందుకు వెళ్లిన నన్ను ఆమె చాలా బాగా ట్రీట్ చేసి గౌరవించింది, అప్పుడే నేను ఆమెతో ప్రేమలో పడిపోయాను.

ఆ సినిమా రెండో షెడ్యూల్ నుండే నేనూ.. నయన్ ప్రేమలో పడి డేటింగ్ మొదలు పెట్టేసాము. కానీ మా విషయం ఎవ్వరికీ తెలియదు. కనీసం నేను నయనతార కారా వ్యాన్ లోకి కూడా వెళ్ళేవాడిని కాదు. నయన్ ని నేను సెట్స్ లో మేడం అనే పిలిచేవాడిని, మేము వృత్తి పట్ల అంత గౌరవంగా ఉండేవాళ్ళం. మా ఇద్దరికీ చాలా సింపుల్ గా ఉండడమే ఇష్టం. ఫ్లైట్ లోనే వెళ్లాలని అనుకోము.. అవకాశం లేకపోతే ట్రైన్ లోనూ జర్నీ చేస్తాము.. ఈమధ్యన అలానే ట్రైన్ జర్నీ చేశామంటూ విగ్నేష్ నయన్ తో తనెలా లవ్ లో పడింది చెప్పుకొచ్చాడు.

Vignesh Shivan about his love story:

Nayanthara and Vignesh Shivan love story

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ