Advertisementt

సాయి తేజ్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ

Sat 15th Apr 2023 03:39 PM
sai tej failure love story  సాయి తేజ్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ
Sai Tej Failed Love Story సాయి తేజ్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ
Advertisement
Ads by CJ

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్ యాక్సిడెంట్ తర్వాత రిపబ్లిక్ విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. రోడ్ యాక్సిడెంట్ తర్వాత చాలా నెలల పాటు షూటింగ్స్ కి దూరంగా ఇంట్లోనే రెస్ట్ లో ఉండిపోయిన సాయి తేజ్.. సుకుమార్ శిష్యుడితో విరూపాక్ష మొదలుపెట్టాడు. ఆ సినిమా ఈ నెల 21 న విడుదలకు సిద్దమవగా.. సాయి తేజ్ తన యాక్సిడెంట్ విషయాలతో పాటుగా తన పర్సనల్ విషయాలను మీడియాతో పంచుకుంటున్నాడు. తాజాగా సాయి తేజ్ తన లవ్ ఫెయిల్యూర్ గురించి చెప్పాడు.

తాను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఒక అమ్మాయిని లవ్ చేశాను అని, ఆ అమ్మాయితో ఈమెయిల్స్, యాహు లో చాటింగ్ చేసేవాడిని, గంటలతరబడి మట్లాడుకునేవాళ్ళం, ఆ అమ్మాయి అమెరికాలో ఉండేది.. అమెరికా నుండి ఇండియాకి వస్తున్నా వస్తున్నా అంటూ వచ్చేసింది. వచ్చాక నేను ఆమె ఈమెయిల్స్, యాహు మెసెంజర్స్ లో చాటింగ్ కోసం ఎదురు చూసాను. కానీ ఆ అమ్మాయి నుండి ఎటువంటి రిప్లై లేదు. ఒక రోజు ఈమెయిల్ వచ్చింది. ఆ ఈమెయిల్ ఓపెన్ చేసేసరికి నా హార్ట్ బ్రేక్ అయ్యింది.

ఆ అమ్మాయి పెళ్లి కూతురుగా ముస్తాబైన పిక్ ని పంపించింది. అప్పుడు చాలా బాధపడ్డాను, ఆ తర్వాత ఈ విషయాన్ని అమ్మతో చెబితే.. నాకు తెలుసు ఇలాగే జరుగుతుంది అని, నెమ్మదిగా అమర్చిపోతావులే అని సర్ది చెప్పింది అని చెప్పిన సాయి తేజ్.. అదే మొదటి లవ్ కాదు, కానీ ఎక్కువగా బాధపెట్టి బ్రేకప్ అయిన లవ్ అంటూ తన బ్రేకప్ లవ్ స్టోరీని బయటపెట్టాడు.

Sai Tej Failed Love Story:

Sai Dharam Tej on his Failure Love Story

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ