టైమ్స్ అఫ్ ఇండియా రిలీజ్ చేసిన ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతులైన 100 మంది జాబితాలో రాజమౌళి చోటు సంపాదించడంతో ఆయన ఫాన్స్, ప్రముఖులు రాజమౌళికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ లో సీతగా అద్భుతమైన కట్టుబొట్టుతో అందంగా కనిపించిన అలియా భట్ రాజమౌళిని తెగ పొగిడేస్తూ ట్వీట్ చేసింది. బాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్ అయ్యుండి రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ లో చిన్న పాత్ర చేయడంపై చాలామంది ఆశ్చర్యపోయారు.
కానీ అలియా భట్ రాజమౌళి సినిమాలో చిన్న పాత్ర దొరికినా ఖచ్చితంగా చెయ్యాలని కోరుకున్నట్లుగా ఆమె ఎప్పుడో చెప్పింది. మరోసారి రాజమౌళి గురించి అలియా భట్ పొగుడుతూ.. నేను బాహుబలి ప్రీమియర్స్ రోజున రాజమౌళిని కలిసాను. బాహుబలి చూస్తున్నంతసేపు చాలా ఆశ్చర్యపోయాను. ఎలాగైనా రాజమౌళి సినిమాలో నటించాలని కోరుకున్నాను. ఆర్.ఆర్.ఆర్ మూవీతో నాకోరిక, కల నెరవేరింది. రాజమౌళితో పని చెయ్యడం అంటే అద్భుతం. ఆయన దగ్గర నుండి ఎన్నో నేర్చుకోవచ్చు. ఆయనతో పని చెయ్యడం అంటే స్కూల్ కి వెళ్ళినట్టే.
ఆయన నుండి ఎన్నో కొత్త అంశాలు నేర్చుకున్నాను, అందుకే రాజమౌళిని మాస్టర్ స్టోరీ టెల్లర్ అని పిలుస్తుంటాను. నటనలో ఏదైనా సలహా ఇమ్మని అడిగాను. దానికి ఆయన ఏ కేరెక్టర్ ని అయినా ప్రేమతో చెయ్యాలి. ఒకవేళ సినిమా హిట్ అవ్వకపోయినా.. అది ప్రేక్షకులకి ఎప్పటికి గుర్తుండిపోయేలా చెయ్యాలంటూ నాకు సలహా ఇచ్చారు అని రాజమౌళిని అలియా భట్ పొగిడేస్తోంది.