రష్మిక మందన్న మోస్ట్ లక్కీయేస్ట్ హీరోయిన్. నిన్నటివరకు సౌత్ లో కాస్త డల్ అనిపించిన రష్మిక మందన్న నేడు.. సౌత్ లో ఒకేసారి రెండు సినిమాలు మొదలు పెట్టేసింది. తన లక్కీ హీరో, డైరెక్టర్ తో తెలుగులో VNR trio అంటూ నితిన్-వెంకీ కుడుములతో కొత్త సినిమాని షురూ చేసిన రష్మిక మందన్న తమిళనాట బైలింగువల్ మూవీ రైయిన్ బో ని మొదలు పెట్టింది. ఇది హీరోయిన్ సెంట్రిక్ మూవీ కావడంతో రశ్మికపై అంచనాలు పెరిగిపోయాయి. మరోపక్క బాలీవుడ్ రణబీర్ తో నటించిన యానిమల్ విడుదలకు సిద్దమవుతుంది.
ఈమధ్యన ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మోని లో అద్భుతమైన డాన్స్ స్టెప్స్ తో ఇరగదీసిన రష్మిక ఇంకా ఆ ఫీల్ నుండి బయటికి రాలేకపోతుంది. ఆ సాంగ్ చేసిన కాస్ట్యూమ్స్ తో ఉన్న పిక్స్ ని, ఎం ఎస్ ధోనితో కలిసి ఐపీఎల్ రోజున దిగిన పిక్ ని షేర్ చేస్తూ ఇంకా ఎగ్జైట్ అవుతూ ఆ క్షణాలని మరిచిపోలేకపోతున్నా అంటుంది. తాజాగా ముద్దుపెట్టేస్తున్న పిక్ ని షేర్ చేస్తూ I don’t know how to pout so a straight out kissie it is.. 😋❤️ అంటూ క్యాప్షన్ పెట్టింది.
లూజ్ హెయిర్ తో రష్మిక అలా ముద్దు పెట్టేస్తున్న పిక్ చూసి యూత్ ఆగమ్మ రష్మిక కించెం సంభాళించుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.