ఈరోజు పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత శాకుంతలం టాక్ చూసి మేకర్స్ ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో శాకుంతలంపై జోక్స్ వేసుకుంటున్నారు. అసలే శాకుంతలం టాక్ తో టెన్షన్ లో ఉన్న మేకర్స్ కి హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ప్రసాద్ ఐ మాక్స్ లో శాకుంతలం షోస్ క్యాన్సిల్ అవడం మూలిగే నక్క మీద తాటి టెంక పడినట్లయ్యింది.
ఓపెనింగ్ డేనే ప్రసాద్ ఐ మ్యాక్స్ లో షోస్ క్యాన్సిల్ అవడం.. ఈ నెగెటివ్ టాక్ తో రెండో రోజు కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపడం ఖాయంగా ఉంది. ఈ రోజు ప్రసాద్ ఐ మ్యాక్స్ ఏరియాలో సీఎం కెసిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించడంతో ఐ మ్యాక్స్, ట్యాంక్ బ్యాండ్, నెక్ లెస్ రోడ్, హుస్సేన్ సాగర్ ఏరియాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిన్ ని నిలిపివేయడంతో ప్రసాద్ ఐ మ్యాక్స్ లో శాకుంతలం షోస్ క్యాన్సిల్ చేసారు. సినిమా విడుదల రోజే అలా షోస్ క్యాన్సిల్ అవడం పట్ల ముందు ప్రేక్షకులు డిస్పాయింట్ అయినా.. ఆ సినిమా టాక్ చూసి ఇప్పుడు కూల్ అవుతున్నారు.
ఏప్రిల్ 14 న అంబేద్కర్ జయంతి కావడంతో సీఎం కేసీఆర్ సచివాలయం ముందు కట్టించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేసి సభ నిర్వహించడమే శాకుంతలానికి శాపంగా మారింది. అంబేద్కర్ జయంతి శాకుంతలానికి శాపంగా మారడం నిజంగా దురదృష్టకరమే.