పోసాని కృష్ణమురళి ఈమధ్యన సినిమాల్లో కన్నా రాజకీయాల్లోనే ఎక్కువ కనబడుతున్నారు. పవన్ కళ్యాణ్ పై, సినిమా ఇండస్ట్రీపై పోసాని చేసే వ్యాఖ్యలతోనే ఆయన న్యూస్ లో నిలుస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే ఏపీ సీఎం జగన్ FDC పదవి కట్టబెట్టారు. ఆ తర్వాత రీసెంట్ గా నంది అవార్డులపై సెన్సేషనల్ కామెంట్స్ చెయ్యగా ఆయనపై సినిమా ఇండస్ట్రీ పెద్దలు విరుచుకుపడ్డారు. అయితే తాజాగా పోసానికి మూడోసారి కరోనా రావడంతో ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు కుటుంభ సభ్యులు.
సినిమా షూటింగ్ నిమిత్తం ఆయన పూణే కి వెళ్లి అక్కడి నుండి నిన్న హైదరాబాద్ కి వచ్చిన నేపథ్యంలో పోసాని కరోనా టెస్ట్ లు చేయించుకోగా.. మూడోసారి ఆయనకి కరోనా అటాక్ అవ్వగా ఆయన్ని కుటుంబ సభ్యులు ప్రవేట్ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పోసాని కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని, ఆయన తీవ్ర అస్వస్థతకి గురైనట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.